franchise fees
-
ఫ్రాంచైజీ ఫీజును తగ్గించండి
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను కరోనా ఆర్థికంగా దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే లీగ్‌లోని ప్రతి జట్టు కూడా సీజన్‌కు రూ.30 కోట్ల మేర నష్టపోతున్న వేళ... కరోనా రూపంలో వారిపై మరింత ఆర్థిక భారం పడనుంది. దాంతో దీని నుంచి కాస్తలో కాస్త తప్పించుకోవడానికి లీగ్‌లో ఆడే అన్ని జట్లు కూడా ఒక ప్రతిపాదనతో ముందుకొచ్చాయి. ఈ ఏడాదికిగాను జట్లు చెల్లించే ఫ్రాంచైజీ ఫీజును తగ్గించాలంటూ లీగ్ నిర్వాహకులను, ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్డీఎల్)ను అభ్యర్థించాయి. ప్రస్తుతం ప్రతి జట్టు కూడా సీజన్‌కు రూ. 13 నుంచి 16 కోట్లను ఫ్రాంచైజీ రుసుముగా చెల్లిస్తున్నట్లు సమాచారం. 2014లో ఎనిమిది జట్లతో ఘనంగా ఆరంభమైన ఐఎస్ఎల్... ప్రస్తుతం పది జట్లకు చేరింది. అయితే అతి తక్కువ కాలంలోనే ఐపీఎల్ తర్వాతి స్థానంలో నిలిచినా... తాము ఇప్పటి వరకు లాభాలను కళ్ల చూడలేదని జట్ల యాజమానులు చెబుతున్నారు. కరోనా దెబ్బతో తమకు స్పాన్సర్లు కూడా దూరమయ్యే అవకాశం ఉందని ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రాంచైజీ ఫీజుపై లీగ్ నిర్వాహకులు ఈ నెలలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
చెన్నై, రాజస్తాన్‌లకు ఫ్రాంచైజీ ఫీజు చెల్లింపు
ముంబై: ఐపీఎల్లో రెండేళ్ల పాటు నిషేధానికి గురైన రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స జట్లకు 30 శాతం ఫ్రాంచైజీ ఫీజును బీసీసీఐ తిరిగి చెల్లించింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో ఈ రెండు జట్లు పాల్గొనలేదు. దీంతో సీఎస్కేకు రూ.11.4 కోట్లు, రాజస్తాన్ రాయల్స్‌కు రూ.8.4 కోట్లను బోర్డు చెల్లించింది. రెండు జట్ల సహ యజమానులు బెట్టింగ్‌కు పాల్పడినందుకు జస్టిస్ లోధా కమిటీ వీటిని రెండేళ్ల పాటు ఐపీఎల్ నుంచి నిషేధించిన విషయం తెలిసిందే. అయినా తమ నుంచి ఫ్రాంచైజీ ఫీజును బీసీసీఐ వసూలు చేయడంపై రెండు జట్లు బాంబే హైకోర్టుకెళ్లారు. అయితే కోర్టు వెలుపల బీసీసీఐ ఒప్పందం చేసుకుని ఈ మొత్తాన్ని చెల్లించింది. మరోవైపు ఐపీఎల్-2016 మ్యాచ్‌ల కోసం మంచి వికెట్‌తో పాటు చక్కటి అవుట్ ఫీల్డ్‌ను సమకూర్చినందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి బీసీసీఐ రూ.28.75 లక్షల నజరానా అందించింది.