ముంబై: ఐపీఎల్‌లో రెండేళ్ల పాటు నిషేధానికి గురైన రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్‌స జట్లకు 30 శాతం ఫ్రాంచైజీ ఫీజును బీసీసీఐ తిరిగి చెల్లించింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు పాల్గొనలేదు. దీంతో సీఎస్‌కేకు రూ.11.4 కోట్లు, రాజస్తాన్ రాయల్స్‌కు రూ.8.4 కోట్లను బోర్డు చెల్లించింది. రెండు జట్ల సహ యజమానులు బెట్టింగ్‌కు పాల్పడినందుకు జస్టిస్ లోధా కమిటీ వీటిని రెండేళ్ల పాటు ఐపీఎల్ నుంచి నిషేధించిన విషయం తెలిసిందే.
అయినా తమ నుంచి ఫ్రాంచైజీ ఫీజును బీసీసీఐ వసూలు చేయడంపై రెండు జట్లు బాంబే హైకోర్టుకెళ్లారు. అయితే కోర్టు వెలుపల బీసీసీఐ ఒప్పందం చేసుకుని ఈ మొత్తాన్ని చెల్లించింది. మరోవైపు ఐపీఎల్-2016 మ్యాచ్‌ల కోసం మంచి వికెట్‌తో పాటు చక్కటి అవుట్ ఫీల్డ్‌ను సమకూర్చినందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి బీసీసీఐ రూ.28.75 లక్షల నజరానా అందించింది.
చెన్నై, రాజస్తాన్‌లకు ఫ్రాంచైజీ ఫీజు చెల్లింపు
Published Thu, Sep 29 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
Advertisement