Free health camps
-
సచివాలయ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు
ఆంధ్రా బ్యాంకు సామాజిక సేవలు అభినందనీయం: రాజేశ్వర్ తివారీ సాక్షి, హైదరాబాద్: ఖాతాదారులకు సేవలందిస్తూనే సామాజిక బాధ్యతగా ఉచిత ఆరోగ్య శిబిరాలు ఆంధ్రాబ్యాంక్ నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ అన్నారు. గురువారం సచివాలయంలో ఆంధ్రాబ్యాంక్ సెక్రటేరియట్ శాఖ, యశోదా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నిర్వహించిన ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో 10 మంది వైద్య నిపుణుల బృందం సుమారు 800 మంది సచివాలయ ఉద్యోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రా బ్యాంక్ జీఎం శ్రీధర్ మాట్లాడుతూ.. త్వరలో నిమ్స్‌కు అంబులెన్స్‌ను ఉచి తంగా అందజేయనున్నామని తెలిపారు. -
వైఎస్సార్ బాటలో ఆయన అభిమానులు
-
ఏపీ యువతికి అమెరికా హెల్త్‌కేర్ లీడర్షిప్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతికి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన హెల్త్‌కేర్ లీడర్షిప్ అవార్డు ఈ ఏడాది కర్నూలు జిల్లాకు చెందిన కొర్రపాటి ప్రియను వరించింది. ఇటీవల లాస్‌ఏంజెలిస్‌లో జరిగిన 17వ హెల్త్‌కేర్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్‌లో ఆమెను ఈ అవార్డుతో సత్కరించారు. వైద్య ఆరోగ్య రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ‘ఎండీ కాన్ఫరెన్స్ ఫైండర్ డాట్ కామ్’ సంస్థకు ఆమె సీఈఓగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్లకు సంబంధించిన మెడికల్ సెమినార్లు, క్లినికల్ విభాగంలో వస్తున్న ఆధునిక పద్ధతులు, మార్పులు, పరికరాల వివరాలు, వాటి ధరల గురించి ఎప్పటికప్పుడూ ఈ సంస్థ తన వెబ్సైట్లో తాజా సమాచారం ఉంచుతుంది. సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకూ ఐదు వేలకుపైగా ఉచిత ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహించారు.