free meals facility
-
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఫేస్బుక్...
వాషింగ్టన్ : టెక్ కంపెనీలంటేనే అధిక జీతాలతో పాటు ఆకర్షణీయమైన సౌకర్యాలకు పెట్టింది పేరు. గూగుల్, ఫేస్బుక్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు ఉచిత రవాణా, భోజన సదుపాయాలు కల్పిస్తాయనే విషయం తెలిసిందే. కానీ త్వరలోనే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఉద్యోగులకు కల్పించే ఉచిత భోజన సౌకర్యాన్ని దూరం చేయనుందని సమాచారం. ఇక మీదట ఫేస్బుక్ ఉద్యోగులకు కల్పించే ఇన్ హౌస్ డైనింగ్ (ఆఫీస్‌లోనే ఉచిత భోజనం) సదుపాయాలను నిలిపి వేయనున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఉద్యోగులకు ఆఫీస్‌లో టీ, కాఫీ, హ్యాండ్ రోల్ సుశీ(ఫ్రాంకీస్) వంటివేవి లభించబోవని తెలిసింది. అయితే ఈ నిబంధన అందరికీ వర్తించదట. త్వరలోనే సిలికాన్ వ్యాలీ, మౌంటెన్ వ్యూలో ప్రారంభించబోయే నూతన క్యాంపస్‌కి మారబోయే 2,000 మంది ఉద్యోగులకు మాత్రమే ఈ నిబంధన వర్తించనున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం మౌంటెన్ వ్యూ నిబంధనలు. మౌంటెన్ వ్యూలో ప్రారంభించబోయే ఏ కంపెనీలు కూడా తమ కార్యాలయాల్లో ఉచిత భోజన సౌకర్యాలు కల్పించకూడదు. ఈ నియమం 2014 నుంచి అమల్లో ఉంది. ఇందుకు మౌంటెన్ వ్యూ అధికారులు చెప్పే కారణం ఏంటంటే ‘కార్యాలయాల్లోనే భోజన సదుపాయాలు కల్పించడం వల్ల సిలికాన్ వ్యాలీ చుట్టు పక్కల ఉన్న స్థానిక వ్యాపారాలు దెబ్బతింటాయి. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ నిర్ణయం 2014 నుంచి అమల్లో ఉంది. 2014కు ముందు ప్రారంభించిన కంపెనీలకు ఈ నియమం వర్తించదు’ అని తెలిపారు. నూతన కార్యాలయంలో ఉచిత భోజన సౌకర్యం తొలగింపు గురించి ఫేస్బుక్ అధికారి ఒకరు ‘త్వరలో మౌంటెన్ వ్యూలో ప్రారంభించబోయే నూతన క్యాంపస్‌లో ‘కెఫెటేరియా’ సౌకర్యం లేదు. కార్యాలయాల్లోనే వంటశాల ఉండటం మౌంటెన్ వ్యూ నిబంధనలకు విరుద్ధం. కానీ ఉద్యోగులు బయట భోజనం చేసినందుకు అయిన ఖర్చును కంపెనీనే, ఉద్యోగులకు చెల్లిస్తుంది’ అని తెలిపారు. -
విమానాశ్రయంలో ‘వింత’ భోజనప్రియుడు
బీజింగ్: విమాన టికెట్టును ఎవరైనా విమానయానం కోసమే ఉపయోగిస్తారు. కానీ, చైనాలోని ఒక వ్యక్తి మాత్రం విమానాశ్రయంలో దొరికే ఉచిత భోజనం కోసమే టికెట్టు తీసుకున్నాడు. టికెట్టును ఎప్పుడు రద్దుచేసుకున్నా, డబ్బును వాపసు చేసే వెసులుబాటు కల్పించిన ఈస్టర్న్ చైనా ఎయిర్‌లైన్స్‌లో ఫస్ట్‌క్లాస్ టికెట్టు కొని, దాంతో విమానంలో ప్రయాణించకుండా, ప్రయాణాన్ని రద్దుచేసుకుంటూ 300 సార్లు అదే టికెట్టును రీబుకింగ్ చేసుకున్నాడు. షాంగ్లీ ప్రావిన్స్ జియాన్ విమానాశ్రయానికి వెళ్లిన ప్రతిసారీ సిబ్బందికి తన టికెట్టు చూపి ఉచిత భోజనాన్ని సుష్టుగా ఆరగించేవాడు. తర్వాత టికెట్టును మరుసటి తేదీకి మార్చుకునేవాడు. ఏడాది వ్యవధిలో ఇలా ఏకంగా 300 సార్లు ఉచిత భోజనాన్ని ఆస్వాదించాడు. చివరకు ఇది గమనించిన సిబ్బంది అతడి టికెట్టును రద్దుచేసుకుని, డబ్బును తిరిగి ఇచ్చేసింది. -
26 పాఠశాలల్లో 625 మంది విద్యార్థినులకు రక్తహీనత
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో జిల్లావ్యాప్తంగా 37 బాలికల ఆశ్రమ పాఠశాలలు, 14 కస్తూర్భా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 20,749 మంది గిరిజన బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఉచిత భోజన వసతితోపాటు మౌలిక వసతులు కల్పిస్తుంది. మొదటి విడుతగా ఆగస్టులో 26 విద్యాలయాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి, భీమిని, నెన్నెల, తాండూర్, దండేపల్లి, మంచిర్యాల, కాసిపేట, జైపూర్, సిర్పూర్(టి), బాబాసాగర్, ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, ఇచ్చోడ, నేరడిగొండ, సోనాల, కాతిగూడ, కడెం, ఖానాపూర్, మాణిక్యాపూర్, తలమడుగు, జైనథ్, తాంసి, బేల, తోషం ప్రాంతాల్లోని విద్యాలయాల్లో వైద్య పరీక్షలు జరిగాయి. సాధారణంగా బాలికల్లో హిమోగ్లోబిన్ శాతం 11.5 నుంచి 16.5 గ్రాములు ఉండాలి.కానీ 5 గ్రాముల నుంచి 11 గ్రాముల వరకు ఉంది. దాదాపు 625 మంది బాలికలకు రక్తహీనత ఉందని, ఇందులో 11మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తేలింది. ఈ నివేదికను వైద్యులు ఐటీడీఏ పీవోకు సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమాలు, కేజీబీవీల్లో పరీక్షలు నిర్వహిస్తే రక్తహీనత విద్యార్థినులు వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యాలయాల్లో పోషకాహారం కరువు గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమాలు, కేజీబీవీల్లో విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. ఈ పాఠశాలలకు పేద విద్యార్థులే వస్తుంటారు. నీళ్ల చారు.. ఉడకని, దొడ్డు అన్నం పెడుతున్నారు. పోషక విలువలు కలిగిన అందించాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే అధికారులు మాత్రం అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోషక విలువలు గల ఆహారం అందిస్తే విద్యార్థులకు రోగనిరోధక శక్తి పెరిగి ఉత్సాహంగా ఉంటారు. దీనితోపాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆటల్లో చదువులో రాణిస్తారు. కానీ, విద్యార్థులకు మంచి భోజనం పెట్టకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు. గతంలో జ్వరం వంటి వ్యాధులతో చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొందరు ఇంటికి తీసుకెళ్లి చదివిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం రూ.కోట్ల నిధులు విడుదల చేస్తున్నా, అధికారులు నిర్లక్ష్యంతో బలవర్ధకమైన ఆహారం అందడం లేదు. ఫలితంగా విద్యార్థినులు అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించి విద్యార్థినులకు పోషకాహరం అందించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రక్తహీనత కేసులు నిజమే.. ఆశ్రమ, కేజీబీవీల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించగా రక్తహీనత ఉందని తేలింది. ఈ నివేదికను ఐటీడీఏ పీవోకు ఇచ్చాము. విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తే రక్తహీనత రాదు. కొన్ని విద్యాలయాల్లో మోనూ ప్రకారం భోజనం అందడం లేదు.దీంతోనే విద్యార్థినులకు రక్తహీనత వస్తుంది. - వెంకటేశ్వర్లు, ఇన్చార్జి డీడీటీడబ్ల్యూ