Free roaming services
-
బీఎస్ఎన్ఎల్ ఉచిత రోమింగ్ షురూ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్.. మొబైల్ కస్టమర్ల కోసం సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇక వివిధ సర్కిళ్లలో తిరిగేటప్పుడు రోమింగ్ చార్జీలపై ఆందోళనతో తమ యూజర్లు పలు సిమ్‌కార్డులు, హ్యాండ్‌సెట్స్‌ను వెంటబెట్టుకోవాల్సిన అవసరం ఉండదని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. దీనితో యావత్ దేశమంతటా ఒకే మొబైల్ నంబరు ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించే దిశగా మరో అడుగు ముందుకు వేసినట్లయిందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్.. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్వీటర్లో పేర్కొన్నారు. జాతీయ టెలికం విధానం 2012 కింద క్రమంగా దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రైవేట్ టెలికం కంపెనీల్లో ఎయిర్‌సెల్ ఇటీవలే అయిదు దక్షిణాది రాష్ట్రాల్లో ఉచిత రోమింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. -
నేటి నుంచి బీఎస్ఎన్ఎల్ ఫ్రీ రోమింగ్
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ నేటి నుంచి ఉచిత రోమింగ్ సర్వీసులను ప్రారంభించనుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు పొందే ఇన్కమింగ్ కాల్స్‌పై ఎలాంటి రోమింగ్ చార్జీలు ఉండవు. తాము ప్రవేశపెట్టిన ఈ సరికొత్త పథకం వల్ల ‘ఒక దేశం-ఒక నంబర్’ అనే కల సాకారమైందని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనూపమ్ శ్రీవాత్సవ అన్నారు. ఉచిత రోమింగ్ కాల్స్ పథకంపై ట్రాయ్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తంచేయలేదని తెలిపారు. -
15 నుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత రోమింగ్
* జూలైలో పూర్తి మొబైల్ నంబర్ పోర్టబులిటీ * కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పరిధిలో ఉచిత రోమింగ్ సేవలు జూన్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. పూర్తిస్థాయి మొబైల్ నంబర్ పోర్టబులిటీ జూలై నుంచి మొదలవ్వనుందని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టెలికం, పోస్టల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. 2004లో బీఎస్ఎన్ఎల్ రూ.10 వేల కోట్ల లాభాల్లో ఉండగా యూపీఏ పదేళ్ల పాలనలో రూ.7,500 కోట్ల నష్టాల్లోకి వెళ్లిందన్నారు. 2008 వరకు లాభా ల్లో ఉన్న ఎంటీఎన్ఎల్ కూడా నష్టాల బాట పట్టిం దన్నారు. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడం, టెలికం, పోస్టల్, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి లక్ష కోట్లకు పైగా ఆదాయం సమకూరిందన్నారు. దేశంలోని 100 పర్యాటక ప్రాంతాల్లో వైఫై ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెలంగాణలోని హైదరాబాద్ సహా బెంగుళూరు, వారణాసిలో ఇప్పటికే వైఫై సేవలు ప్రారంభమైనట్లు వెల్లడించారు.