స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం
జోగిపేట: బ్రిటిష్ పాకులకు వ్యతిరేకంగా పోరాడి భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి సమరయోధుల కృషి మరవలేనిదని ఎంపీపీ అధ్యక్షురాలు సీహెచ్ విజయలక్ష్మి, నగర పంచాయతీ చైర్పర్సన్ ఎస్.కవిత, జెడ్పీటీసీ శ్యామమ్మ అన్నారు. సోమవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక సమరయోధులు అల్లె చిన్నమల్లయ్య, జీ.లింగమయ్య గౌడ్, అరిగె ఆశయ్యను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడిన వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలన్నారు. కార్యక్రమంలో తహాసీల్దార్ నాగేశ్వరరావు, సీఐలు వెంకటయ్య, శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీధర్, లక్ష్మినారాయణ, పట్టాభిరామ్, జైలర్ అచ్చయ్య, మాజీ ఎంపీపీ రామాగౌడ్, ఏడీఏ శ్రీలత, ఏఓ విజయరత్న, ఉప తహసీల్దార్ కిష్టయ్య, ఆర్ఐలు సతీష్, నహీం పాల్గొన్నారు.