
స్వాతంత్య్ర సమరయోధులను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
భువనేశ్వర్ : రాష్ట్రం నుంచి ముగ్గురు స్వాతంత్య్ర సమర యోధులకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఏటా ఆగస్టు 9వ తేదీన క్రాంతి దివస్‌ను పురస్కరించుకుని నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆ ముగ్గురు స్వాతంత్య్ర సమర యోధులకు దుశ్శాలువాలు కప్పి పుష్ప గుచ్ఛాలు సమర్పించి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సత్కరించారు. ఈ సత్కారం అందుకున్న వారిలో భద్రక్ జిల్లా సూర్యాపూర్‌కు చెందిన రామ హరి గోస్వామి, నయాగడ్ జిల్లా సిందూరియా గ్రామస్తుడు ఈశ్వర్ బిసొయి, సంబల్‌పూర్ జిల్లా కల్మి గ్రామస్తుడు దేబేంద్ర గుప్తా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment