'కోట్లా'టలోనూ సఫారీలను తిప్పేస్తారా..?
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఫ్రీడం సిరీస్‌లో భాగంగా చివరి, నాలుగో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా చివరి మ్యాచ్‌లోనూ అదేజోరు కొనసాగించాలనే ఉత్సాహంతో ఉండగా.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బోణీ కొట్టి విజయంతో భారత్ పర్యటన ముగించాలని సఫారీలు ఆరాటపడుతున్నారు. గురువారం నుంచి ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, తొలి, మూడో టెస్టుల్లో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ స్పిన్నర్లు మూడే రోజుల్లో సఫారీలను తిప్పేశారు. ఢిల్లీలోనూ కోహ్లీ సేన స్పిన్ ఆయుధంగా బరిలోకి దిగుతోంది. స్పిన్నర్లు అశ్విన్, జడేజాపై మరోసారి భారీ అంచనాలున్నాయి. కాగా ప్రపంచ అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లున్నా దక్షిణాఫ్రికా జట్టు స్పిన్ పిచ్‌లపై బోల్తాపడుతోంది. చివరి మ్యాచ్‌లోనైనా స్పిన్ బలహీనతను అధిగమించి విజయం సాధించాలని భావిస్తోంది.
మ్యాచ్ సమయం: ఉదయం 9:30 గంటల నుంచి