French soldiers
-
‘నా కొడుకు ఉగ్రవాది కాదు’
ప్యారిస్: తన కుమారుడు ఉగ్రవాది కాదని ప్యారిస్‌లోని ఓర్లి విమానాశ్రయంలో సైనికుల చేతుల్లో ప్రాణాలుకోల్పోయిన అగంతకుడి తండ్రి చెప్పాడు. మద్యం సేవించడం, మత్తుపదార్థాలు తీసుకోవడం వల్ల అతడి చర్యలు అలాంటి ఆందోళన కలిగిస్తాయని చెప్పారు. ‘నా కొడుకు ఉగ్రవాది కాదు. అతడు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. బాగా తాగుతాడు. ఆ కారణం వల్లే అతడి చర్యలు విపరీతంగా అనిపిస్తాయి’ అని జియాద్ బెన్ బెల్గాసెమ్ తండ్రి ఫ్రాన్స్‌కు చెందిన యూరప్ 1 రేడియోకు వివరాలు అందించాడు. ఓర్లి విమానాశ్రయంలో గస్తీ నిర్వహిస్తున్న ఓ సైనికురాలి వద్ద తుపాకీ లాక్కునేందుకు జియాద్ ప్రయత్నించి ప్రకంపనలు సృష్టించాడు. అతడి చర్యతో అవాక్కయిన బలగాలు వెంటనే అతడిని ఉగ్రవాదిగా భావించి కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే, అంతకంటే ముందు అతడు అల్లా కోసం చనిపోతానని, వేరే వాళ్లను చంపేస్తానని బెదిరించినట్లు కాల్పులు జరిపిన సైనికులు చెబుతున్నారు. సంబంధిత మరిన్ని వార్తా కథనాలకై చదవండి ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం -
ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం
-
ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కాల్పుల ఘటనతో ఉలిక్కిపడింది. శనివారం ప్యారిస్ ఓర్లీ విమానాశ్రయంలో ఓ అగంతకుడు సైనికుల నుంచి తుపాకీ లాక్కొనేందుకు ప్రయత్నించగా.. సైనికులు వెంటనే అప్రమత్తమై అతనిపై కాల్పులు జరిపారు. అగంతకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన తర్వాత విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. విమానాశ్రయంలో సెక్యూరిటి ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఫ్రాన్స్ సైనికుల కాల్పుల్లో మరణించిన అగంతకుడు ఎవరు? ఎందుకు తుపాకీ లాక్కోవాలని ప్రయత్నించాడు? ఇందులో ఉగ్రకోణం ఉందా? వంటి విషయాలు తెలియాల్సివుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
తొలిసారి విదేశీ జవాన్ల కవాతు
ఆకట్టుకున్న ఫ్రెంచ్ పదాతిదళం న్యూఢిల్లీ: భారత చరిత్రలో తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో విదేశీ సైనికులు కవాతు చేశారు. రాజ్‌పథ్‌లో జరిగిన పరేడ్‌లో ఫ్రెంచ్ సైనికులు (ఆ దేశ మిలటరీలోని 35వ పదాతిదళం) పాల్గొన్నారు. లెఫ్టినెంట్ కల్నల్ పాల్ నాయకత్వంలో 76 మంది సైనికుల బృందం రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్లతోపాటు అశేష ప్రేక్షకుల ముందు పరేడ్‌లో పాల్గొన్నారు. 48 సభ్యుల ఫ్రెంచ్ మిలటరీ బ్యాండ్ అందించిన రెండు మిలటరీ ట్యూన్లను నేతలతోపాటు ఆహుతులు చప్పట్లతో అభినందించారు. పరేడ్‌లో పాల్గొనటం గర్వంగా ఉందని.. ఇది తమ పదాతిదళానికి దక్కిన అరుదైన గౌరవమని ఈ బృంద సారథి పాల్ తెలిపారు. ఫ్రెంచ్ చరిత్రలో ఈ 35వ ఇన్ఫాంట్రీ చాలా పురాతనమైనదని, అల్జీరియా, ఆఫ్రికా, అఫ్గాన్ వంటి దేశాల్లో 12 యుద్ధాల్లో పాల్గొందని వెల్లడించారు.