ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం | Man Shot Dead At Paris Airport After Taking Soldiers Gun, Says Official | Sakshi
Sakshi News home page

ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం

Published Sat, Mar 18 2017 2:40 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం - Sakshi

ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం

ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కాల్పుల ఘటనతో ఉలిక్కిపడింది. శనివారం ప్యారిస్‌ ఓర్లీ విమానాశ్రయంలో ఓ అగంతకుడు సైనికుల నుంచి తుపాకీ లాక్కొనేందుకు ప్రయత్నించగా.. సైనికులు వెంటనే అప్రమత్తమై అతనిపై కాల్పులు జరిపారు. అగంతకుడు అక్కడికక్కడే మరణించాడు.  

ఈ ఘటన తర్వాత విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. విమానాశ్రయంలో సెక్యూరిటి ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఫ్రాన్స్ సైనికుల కాల్పుల్లో మరణించిన అగంతకుడు ఎవరు? ఎందుకు తుపాకీ లాక్కోవాలని ప్రయత్నించాడు? ఇందులో ఉగ్రకోణం ఉందా? వంటి విషయాలు తెలియాల్సివుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.





Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement