FTAPCCI
-
జీఎస్టీ అలవాటు కావడానికి ఆరు నెలలు
ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోదీ హైదరాబాద్: ఆదాయపు పన్ను దాఖలు చేసే విషయంలో వ్యాపార, వాణిజ్య సంస్థల పట్ల ప్రభుత్వం ఓ ఏడాదిపాటు ఉదాసీనంగా ఉండాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) అభిప్రాయపడింది. తొలిసారిగా జీఎస్టీని అమలు చేస్తుండడమే ఇందుకు కారణమని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పన్ను వివిధ శ్లాబుల్లో ఉన్నందున వన్ నేషన్– వన్ ట్యాక్స్‌కు బదులుగా వన్ కమోడిటీ–వన్ ట్యాక్స్ అని పిలవాలన్నారు. జీఎస్టీని అర్థం చేసుకోవడానికి వ్యాపారులకు కనీసం ఆరు నెలలైన సమయం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎన్నో అంశాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. కొందరు ప్రభుత్వ అధికారులకే వీటిపై స్పష్టత లేదు. జీఎస్టీ అమలు చేయటమనేది భారత దేశ చరిత్రలో చారిత్రక ఘట్టం. స్వాతంత్య్రం అనంతరం తీసుకున్న సాహసోపేత సంస్కరణల్లో ఇదొకటి. కాకపోతే కొన్ని అంశాల్లో స్పష్టత అవసరం. జీఎస్టీ అమలైతేనే వీటిని అర్థం చేసుకోగలం. చాలా మంది వర్తకులు, సేవలందించే వారు పన్ను పరిధిలోకి కొత్తగా వస్తున్నారు. పన్నులు, ఆదాయపు పన్ను దాఖలు గురించి అవగాహనకు వీరికి కొంత సమయం పడుతుంది. కాబట్టి చిన్న వర్తకులు నూతన వ్యవస్థను అర్థం చేసుకునే వరకు ప్రభుత్వం ఏడాదిపాటు ఉదాసీనంగా వ్యవహరించాలి’ అన్నారు. ఉదాహరణకు స్వీట్లు 5%, కన్ఫెక్షనరీ 18% పన్ను పరిధిలో ఉన్నాయి. అయితే కొన్ని ఉత్పాదనలు ఏ విభాగం కిందకు వస్తాయోననే సంశయం ఉందన్నారు. సాక్షి బిజినెస్ వెబ్సైట్లో... ♦ దీర్ఘకాల పెట్టుబడులకు ఇదే తరుణం! ♦ మార్కెట్ పరుగు ఆగదు ♦ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్కు మంచి రోజులు..! ♦ కేశోరామ్ షేర్లు కళ కళ ♦ రికార్డ్ స్థాయికి గ్రాసిమ్, ఆదిత్య బిర్లా నువో ♦ నొముర డౌన్‌గ్రేడ్‌తో ఫోర్టిస్ 4 శాతం డౌన్ ♦ మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, స్టాక్ అప్డేట్స్.. WWW.SAKSHIBUSINESS.COM -
ఎఫ్టీఏపీసీసీఐ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం తెలంగాణ, ఏపీ వాణిజ్య పారిశ్రామిక మండలి(ఎఫ్టీఏపీసీసీఐ) శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధి మార్గంలో పయనిస్తుందన్నారు. గత 15 సంవత్సరాల అభివృద్ధిలో భారత్ యొక్క బలమైన పునాదులతో పాటు.. బాహ్యకారకాలు దోహదపడ్డాయని అన్నారు. భారత్ కొన్ని దిద్దుబాటు చర్యలను సరైన సమయంలో చేపట్టిందన్నారు. సంక్షోభ సమయంలో సైతం భారత్ వృద్ధివైపు పయనించిందని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న డిజిటల్ ఇండియా, క్లీన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు సమ్మిళిత వృద్ధికి తోడ్పడుతున్నాయని ప్రణబ్ పేర్కొన్నారు. ఎఫ్టీఏపీసీసీఐ ప్రెసిడెంట్ రవినియ మోదీ మాట్లాడుతూ.. ఏ సంస్థకైనా 100 సంవత్సరాల ప్రయాణం అనేది సుదీర్ఘమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌గా రవీంద్ర మోదీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) ప్రెసిడెంట్‌గా 2016-17 సంవత్సరానికిగాను హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎండీ రవీంద్ర మోదీ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగారు. ముంబైలోని యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఆహార పరిశ్రమలో 30 ఏళ్లకుపైగా అనుభవం ఆయన సొంతం. సూర్య బ్రాండ్‌తో మసాలాలు, ఇతర ఆహారోత్పత్తులను హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయిస్తోంది. ఇక ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా గౌర పెట్రోకెమ్ ఎండీ గౌర శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఎనిమిదేళ్లుగా ఫ్యాప్సీలో వివిధ హోదాల్లో పనిచేశారు. -
కోటి రూపాయల వరకు సెక్యూరిటీ లేని లోన్