జీఎస్‌టీ అలవాటు కావడానికి ఆరు నెలలు | GST: FTAPCCI fears misuse of anti-profiteering clause | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ అలవాటు కావడానికి ఆరు నెలలు

Published Sat, Jul 1 2017 12:48 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

జీఎస్‌టీ అలవాటు కావడానికి ఆరు నెలలు

జీఎస్‌టీ అలవాటు కావడానికి ఆరు నెలలు

ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌ రవీంద్ర మోదీ
హైదరాబాద్‌: ఆదాయపు పన్ను దాఖలు చేసే విషయంలో వ్యాపార, వాణిజ్య సంస్థల పట్ల ప్రభుత్వం ఓ ఏడాదిపాటు ఉదాసీనంగా ఉండాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) అభిప్రాయపడింది. తొలిసారిగా జీఎస్‌టీని అమలు చేస్తుండడమే ఇందుకు కారణమని ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌ రవీంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పన్ను వివిధ శ్లాబుల్లో ఉన్నందున వన్‌ నేషన్‌– వన్‌ ట్యాక్స్‌కు బదులుగా వన్‌ కమోడిటీ–వన్‌ ట్యాక్స్‌ అని పిలవాలన్నారు. జీఎస్‌టీని అర్థం చేసుకోవడానికి వ్యాపారులకు కనీసం ఆరు నెలలైన సమయం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

‘ఎన్నో అంశాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. కొందరు ప్రభుత్వ అధికారులకే వీటిపై స్పష్టత లేదు. జీఎస్‌టీ అమలు చేయటమనేది భారత దేశ చరిత్రలో చారిత్రక ఘట్టం. స్వాతంత్య్రం అనంతరం తీసుకున్న సాహసోపేత సంస్కరణల్లో ఇదొకటి. కాకపోతే కొన్ని అంశాల్లో స్పష్టత అవసరం. జీఎస్‌టీ అమలైతేనే వీటిని అర్థం చేసుకోగలం. చాలా మంది వర్తకులు, సేవలందించే వారు పన్ను పరిధిలోకి కొత్తగా వస్తున్నారు. పన్నులు, ఆదాయపు పన్ను దాఖలు గురించి అవగాహనకు వీరికి కొంత సమయం పడుతుంది. కాబట్టి చిన్న వర్తకులు నూతన వ్యవస్థను అర్థం చేసుకునే వరకు ప్రభుత్వం ఏడాదిపాటు ఉదాసీనంగా వ్యవహరించాలి’ అన్నారు. ఉదాహరణకు స్వీట్లు 5%, కన్ఫెక్షనరీ 18% పన్ను పరిధిలో ఉన్నాయి. అయితే కొన్ని ఉత్పాదనలు ఏ విభాగం కిందకు వస్తాయోననే సంశయం ఉందన్నారు.

సాక్షి బిజినెస్‌ వెబ్‌సైట్‌లో...
దీర్ఘకాల పెట్టుబడులకు ఇదే తరుణం!
మార్కెట్‌ పరుగు ఆగదు
శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు మంచి రోజులు..!
కేశోరామ్‌ షేర్లు కళ కళ
రికార్డ్‌ స్థాయికి గ్రాసిమ్, ఆదిత్య బిర్లా నువో
నొముర డౌన్‌గ్రేడ్‌తో ఫోర్టిస్‌ 4 శాతం డౌన్‌
మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, స్టాక్‌ అప్‌డేట్స్‌..

WWW.SAKSHIBUSINESS.COM

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement