funeral vehicles
-
అమానవీయ ఘటన: బైక్‌పై తల్లి మృతదేహంతో 80 కిలోమీటర్లు!
షాదోల్: ఆస్పత్రిలో శవ వాహనం లేకపోవడంతో ప్రైవేట్ వాహనదారులకు రూ.5 వేలు చెల్లించుకోలేక తల్లి మృతదేహాన్ని ఓ పేద యువకుడు ఏకంగా 80 కిలోమీటర్లు బైక్ మీదనే తీసుకెళ్లాడు! బెడ్‌షీట్‌లో చుట్టిన తల్లి శవాన్ని 100 రూపాయలతో కొన్న చెక్కపై పెట్టి బైక్‌కు కట్టి, మరొకరిని వెనక కూచోబెట్టి నడుపుకుంటూ వెళ్లాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనుప్పుర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల జైమంత్రి యాదవ్ ఛాతీ నొప్పికి చికిత్స పొందుతూ షాదోల్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి మరణించింది. శవ వాహనం లేదని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో మరో మార్గం లేక బైక్‌మీదే తీసుకెళ్లాల్సి వచ్చిందని కుమారుడు వాపోయాడు. కానీ అతను శవ వాహనం అడగనే లేదని మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ చెప్పారు. తమ వద్ద వాహనం లేని మాట నిజమే అయినా ఇలాంటప్పుడు జిల్లా ఆస్పత్రి నుంచో, స్థానిక సంస్థల నుంచో వాటిని సమకూరుస్తామన్నారు. -
అంతిమ యాత్ర వాహనాలు ప్రారంభం
హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లో పేదలు చనిపోతే వారి భౌతిక కాయాలను శ్మశానానికి తరలించేందుకు నగరంలో అంతిమ యాత్ర(పరమ పద) వాహనాలను మంత్రులు లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు శుక్రవారం ప్రారంభించారు. ఈ వాహనాల్లో భౌతిక కాయాలను తీసుకెళ్లేందుకు ఎలాంటి అవినీతికి పాల్పడవద్దని వాహన చోదకులను ఆదేశించారు. గాంధీ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి తలసాని అసహనం వ్యక్తంచేశారు. బెడ్షీట్లు మార్చడం లేదని, లిఫ్టులు సరిగా పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచుతున్నామని, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులపై భారం తగ్గించేందుకు ఎక్కడికక్కడ వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు త్వరలో ‘అమ్మ ఒడి’ 102 వాహనాలను అందుబాటులోకి తెస్తామన్నారు.