
షాదోల్: ఆస్పత్రిలో శవ వాహనం లేకపోవడంతో ప్రైవేట్ వాహనదారులకు రూ.5 వేలు చెల్లించుకోలేక తల్లి మృతదేహాన్ని ఓ పేద యువకుడు ఏకంగా 80 కిలోమీటర్లు బైక్ మీదనే తీసుకెళ్లాడు! బెడ్‌షీట్లో చుట్టిన తల్లి శవాన్ని 100 రూపాయలతో కొన్న చెక్కపై పెట్టి బైక్‌కు కట్టి, మరొకరిని వెనక కూచోబెట్టి నడుపుకుంటూ వెళ్లాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనుప్పుర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల జైమంత్రి యాదవ్ ఛాతీ నొప్పికి చికిత్స పొందుతూ షాదోల్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి మరణించింది. శవ వాహనం లేదని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో మరో మార్గం లేక బైక్‌మీదే తీసుకెళ్లాల్సి వచ్చిందని కుమారుడు వాపోయాడు. కానీ అతను శవ వాహనం అడగనే లేదని మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ చెప్పారు. తమ వద్ద వాహనం లేని మాట నిజమే అయినా ఇలాంటప్పుడు జిల్లా ఆస్పత్రి నుంచో, స్థానిక సంస్థల నుంచో వాటిని సమకూరుస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment