g srinivas
-
కరోనా: రాబోయే మూడు నెలలు జాగ్రత్త!
సాక్షి, ఎంజీఎం: చలికాలంలో కోవిడ్ తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని నవంబర్‌తో పాటు డిసెంబర్, జనవరి నెలలో ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా కాపాడుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస్‌రావు సూచించారు. చలికాలంలో కోవిడ్ నివారణ కోసం వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు వరంగల్ ఉమ్మడి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం ఆయన హన్మకొండలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. చదవండి: సెకండ్ వేవ్: కరోనా మార్గదర్శకాలు అన్నింటి లక్షణాలు ఒక్కటే చలికాలంలో ప్లూ ద్యారా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కోవిడ్‌ను పోలి ఉంటాయని శ్రీనివాసరావు తెలిపారు. దీంతో వ్యాధి నిర్దారణ కోసం కోవిడ్ పరీక్షలు తప్పనిసరి అని చెప్పారు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడ కూడా ఉచిత కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే అంశంపై స్పష్టత లేకపోగా, వ్యాక్సిన్‌తో వంద శాతం రక్షణ ఉంటుందా, లేదా అనేది కూడా తెలియడం లేదని చెప్పారు. ఈ మేరకు ప్రజలే స్వీయ రక్షణ కోసం మాస్క్ ధరించడం, ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడంతో పాటు నిత్యం చేతులను శుభ్రం చేసుకుంటూ సమూహాలకు దూరంగా ఉండాలని సూచించారు. చదవండి: పీఎఫ్ కార్యాలయాలకు రావొద్దు.. రాష్ట్రంలో నేటి వరకు నేటి వరకు 44లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 2,42,506 కేసులు నమోదయ్యాయని, ఇందులో ప్రస్తుతం 17,742 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 2,400 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. గత మూడు నెలల క్రితం వరకు ప్రతిరోజు 60వేలకు పైగా కేసులు ఉండగా, గత 45 రోజులుగా ఈ సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిందని స్పష్టం చేశారు. యూరోపియన్, ప్రాన్స్, ఇంగ్లాండ్ వంటి దేశాలతో పాటు మన దేశంలోని కేరళ, పశ్చిమబెంగాల్లో కేసులు పెరిగినా, మన దగ్గర ఆ పరిస్థితి లేదని తెలిపారు. అయినప్పటికీ చలికాంలో వైరస్‌కు అనువైన కాలమైనందున జలుబు, దగ్గు, జ్వరం బారిన పడినా వైద్యులకు సలహాతోనే చికిత్స పొందాలని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. క రోనా వైరస్ తగ్గినట్లే తగ్గుతున్నా, మళ్లీ వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని తెలిపారు. కాగా, ఈ ఏడాది అంటువ్యాధుల వ్యాప్తి గణనీయంగా తగ్గిందని, గత ఏడాదితో పోలిస్తే 50 శాతం కూడా నమోదు కాలేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. ప్రజల్లో వచ్చిన చైతన్యమే వ్యాధుల వ్యాప్తి తగ్గుదలకు కారణమన్నారు. కోవిడ్ వైరస్ ప్రజల జీవనవిధానంలో పెనుమార్పు తీసుకవచ్చిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ లలితాదేవి, మధుసూధన్, శ్రీరాం, మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దారిదోపిడీ హత్య కేసులలో ముగ్గురికి ఉరిశిక్ష
సంచలనం దారిదోపిడీ హత్య కేసులలో ముగ్గురికి ఉరిశిక్ష గుంటూరు లీగల్, న్యూస్‌లైన్ దూర ప్రాంత ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడి ఎదురు తిరిగితే హత్యచేసే నరహంతక ముఠాలోని ముగ్గురికి ఉరి శిక్ష, జరిమానా విధిస్తూ మంగళవారం ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.శ్రీనివాస్ తీర్పు చెప్పారు.(ప్రధాన వార్త మెయిన్‌లో) ఉరిశిక్షపడిన మురళీకృష్ణ, శివరామకృష్ణ, అమర నాగేశ్వరరావులు ముగ్గరు దాచేపల్లి మండలానికి చెందినవారు కావడంతో ఈ కేసు జిల్లాలో సంచలనమైంది. దాచేపల్లి మండలానికి చెందిన తొమ్మిది మంది ఓ ముఠాగా ఏర్పడి పలు విధాలుగా దోపిడీలు చేయడమే కాకుండా పరిస్థితిని బట్టి హత్యలు చేస్తుండేవారు. ఉరిశిక్ష పడిన యక్కలూరి శివకృష్ణ (యోగి),అక్కినపల్లి మురళీకృష్ణ(మురళి), ఇరికేపల్లికి చెందిన పప్పుల అమర నాగేశ్వరరావు(అమర్)లతోపాటు మరో ఆరుగురు జల్సాలకు అలవాటుపడి పలు నేరాలకు పాల్పడ్డారు. దారిదోపిడీలు చేస్తూ ఎదురుతిరిగిన వారిని హత్య చేసేవారు. ఈ క్రమంలో 2011 ఫిబ్రవరిలో కృష్ణా జిల్లా నందిగామకు చెందిన, ఎన్ఎస్పీ కెనాల్స్ ఇరిగేషన్ శాఖలో డెప్యూటి ఇంజనీరు దారావత్ బద్యానాయక్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో తీగ లాగిన పోలీసులకు ఈ బృందం ఘాతుకాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ వెళ్లేందుకు విజయవాడ బస్టాండ్‌లో వేచివున్న బద్యానాయక్‌ను తన కారులో తీసుకెళతామని నమ్మించారు. కారును దారి మళ్ళించిన నిందితులు అతని వద్దఉన్న గొలుసు, ఉంగరం, వాచీ, ఎటిఎం కార్డులను లాక్కొని హత్యచేసి ఎన్ఎస్సీ కెనాల్లో వేసి ఉడాయించారు. ఇంజినీరు భార్య తన భర్త కనిపించడం లేదని చేసిన ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణ చేపట్టి ఈ నరహంతక ముఠాను పట్టుకొన్నారు. వీరు ముగ్గురు మాత్రమే కాకుండా మిగిలిన ఆరుగురుపై గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో నమోద యిన కేసులన్నింటినీ గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానంలో విచారిం చాల్సిం దిగా రాష్ట్రహైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు 2011 డిసెంబర్ 2వ తేదీన ప్రభుత్వం జీవో నంబర్ 138 ప్రకారం కేసు విచారణ గుంటూరు కోర్టుకు బదిలీ ఉత్తర్వులిచ్చింది. ప్రాసిక్యూషన్ వారి నేరాలను రుజువు చేయడంతో న్యాయమూర్తి శ్రీనివాస్, నేరస్తులు ముగ్గురికి ఉరిశిక్ష, 12వేల రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. ఈ ముగ్గురు రెండేళ్ళ కిందట చేసిన దారిదోపిడీ కేసులో గత జనవరిలో ఇదే న్యాయస్థానం ఒక్కొక్కరికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఏపీపీ కాసు వెంకటరెడ్డి ప్రాసిక్యూషన్ నిర్వహించగా సీసీఎస్ డీఎస్పీ టి. రవీంద్రబాబు, సీసీఎస్ అర్బన్ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో సాక్షుల విచారణ జరిగింది. ఇది రెండవ ఉరిశిక్ష కేసు... జిల్లా కోర్టు పరిధిలో దాదాపు ఇరవై సంవత్సరాల కిందట చిలకలూరిపేట బస్సు దహనం కేసులో ఉరి శిక్ష పడిన నేరస్తులు గంటెల విజయవర్ధన్, చలపతిరావుల అనంతరం ఉరిశిక్ష పడిన నేరస్తులు ఈ ముగ్గురే కావడం విశేషం. జల్సాలకు అలవాటు పడి... దాచేపల్లి, న్యూస్‌లైన్: దాచేపల్లి అచ్చాలగడ్డకు చెందిన అక్కినపల్లి వెంకటేశ్వర్లు, కోటేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన మురళీకృష్ణ జల్సాలకు అలవాటు పడ్డాడు. రెండవ తరగతి వరకు చదువుకున్న మురళీకృష్ణ ఆరేళ్లుగా కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చెడువ్యసనాలకు అలవాటు పడిన మురళీకృష్ణను కొంతకాలంగా తండ్రి ఇంటికి రానివ్వడం లేదు. శిక్ష తగ్గించాలని కోరుతూ పై కోర్టులను ఆశ్రయించనున్నట్టు మురళీకృష్ణ తండ్రి వెంకటేశ్వర్లు చెప్పారు. పై కోర్టును ఆశ్రయిస్తాం... నడికుడి పంచాయతీ యిరికేపల్లికి చెందిన పప్పుల అమర నాగేశ్వరావుకు ఉరిశిక్ష పడడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. పప్పుల చంద్రయ్య, నాగరత్నం దంపతులకు కుమారుడైన అమర నాగేశ్వరావుకు ఓ సోదరి, తల్లి వున్నారు. ముగ్గుమిల్లులో పనిచేసే తండ్రి చంద్రయ్య ఐదు నెలల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యాయం కోసం పై కోర్టులను ఆశ్రయిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.