Galaxy team
-
బౌలింగ్‌లో చెలరేగిన చైతన్య
సాక్షి, హైదరాబాద్: డీజీజే చైతన్య (5/27) అద్భుత బౌలింగ్‌తో చెలరేగడంతో గెలాక్సీ జట్టుపై కాంటినెంటల్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. హెచ్‌సీఏ ‘ఎ’ డివిజన్ రెండు రోజుల లీగ్ పోటీల్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గెలాక్సీ 76 పరుగులకే కుప్పకూలింది. శశిధర్ ఒక్కడే రాణించి 40 పరుగులు చేశాడు. అనంతరం కాంటినెంటల్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రోహిత్ రెడ్డి (50) అర్ధ సెంచరీతో జట్టును గెలిపించాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు గుజరాతీ: 220 (మనోజ్ 42, బల్జీత్ సింగ్ 38, సురేశ్ 3/48); స్పోర్టింగ్ ఎలెవన్: 189 (వికాస్ మోహన్ 57, నదీముద్దీన్ 47, ధారస్ వర్ధన్ 6/50)పై గెలుపు. పి అండ్ టి కాలనీ: 169 (అభిషేక్ కుమార్ 5/54, స్టీవెన్ సన్ 3/39); నిజాం కాలేజి: 157 (శరత్ కుమార్ 91, తఖీయుల్లా 3/32, ఉత్తమ్ కుమార్ 3/35, అజయ్ రావత్ 3/56)పై గెలుపు. ఎస్ఏ అంబర్పేట్: 173 (షహబాజ్ 43 నాటౌట్, ఫహీం 34, జయసూర్య 5/39); తెలంగాణ: 71/2 (అనురాగ్ 39 నాటౌట్)తో డ్రా. సుల్తాన్ షాహీ: 343/9 (వినయ్ కుమార్ 160 నాటౌట్, అశ్విన్ విజయ్ 62, మనీశ్ పరాశర్ 5/121); బడ్డింగ్ స్టార్స్: 186/4 (తుషార్ సక్లాని 92, శిరీష్ గౌడ్ 37)తో డ్రా. సీసీఓబీ: 189 (అబ్దుల్ మన్నన్ 89, మార్క్ 4/35, పర్గత్ సింగ్ 3/45); ఖల్సా: 121/5 తో డ్రా.హెచ్‌బీసీసీ: 217 (అమేయ సోమన్ 152); సాయి సత్య: 121/7 (మికిల్ జైస్వాల్ 49)తో డ్రా. ఉస్మానియా: 156 (సంతోష్ రెడ్డి 54, బి.ప్రసాద్ 4/29); నేషనల్: 13/0 తో డ్రా. -
చెలరేగిన చరణ్‌సాయి తేజ
సాక్షి, హైదరాబాద్: చరణ్‌సాయి తేజ బంతితో విజృంభించడంతో... ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ చాంపియన్‌షిప్‌లో కొసరాజు జట్టు ఘనవిజయం నమోదు చేసింది. గెలాక్సీతో జరిగిన ఈ మ్యాచ్‌లో కొసరాజు 372 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచింది. కొసరాజు జట్టు బౌలర్ చరణ్‌సాయి తేజ 24 పరుగులకే 7 వికెట్లు పడగొట్టి గెలాక్సీ జట్టును దెబ్బతీశాడు. 489 పరుగుల లక్ష్యంతో రెండో రోజు బుధవారం బ్యాటింగ్‌కు దిగిన గెలాక్సీ 28.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. శశిధర్ రావు (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు తొలి రోజు లోహిత్ (203), అజయ్ (143) సెంచరీలతో హోరెత్తించడంతో కొసరాజు జట్టు 3 వికెట్లకు 488 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ విజయంతో కొసరాజు ఖాతాలో ఐదు పాయింట్లు చేరాయి. మరో మ్యాచ్‌లో సత్యనారాయణ (6/35) బౌలింగ్‌లో చెలరేగడంతో ఉస్మానియా జట్టు రెండు వికెట్లు తేడాతో సాయిసత్యపై నెగ్గింది. 190 పరుగుల లక్ష్యం తో రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఉస్మానియా 53.3 ఓవర్లలో 8 వికెట్లకు 194 పరుగులు చేసింది. సంతోష్ (53), రామ్‌ప్రసాద్ (49) రాణించారు. ప్రతీక్ 4 వికెట్లు తీశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోరు వివరాలు ఠ గౌడ్స్ ఎలెవన్: 404; టీమ్ స్పీడ్: 188 (సంతోష్ 68, నాగరాజ్ 5/57). ఠ తెలంగాణ: 158; న్యూబ్లూస్: 132 (భగత్ ప్రసాద్ 59, దత్త ప్రకాశ్ 37, అనురాగ్ 3/19). ఠ నిజామ్ కాలేజి: 215; బడ్డింగ్ స్టార్: 180 (వెంకటేశ్ 4/59, స్టీవెన్సన్ 3/18). ఠ క్రౌన్ : 121; హైదరాబాద్ టైటాన్స్: 99 (సందీప్ 8/34). ఠ విశాక: 223; మెగాసిటీ: 217 (అనిరుధ్ 42, శ్రీకర్ 65, మెహర్ ప్రసాద్ 5/67). ఠ ఎంసీసీ: 271; చార్మినార్: 209/7 (జితేందర్ 45, అమోది 72 నాటౌట్, వినయ్ 3/62(వర్షం కారణంగా మ్యాచ్‌లో ఫలితం రాలేదు)