చెలరేగిన చరణ్‌సాయి తేజ | charansai teja took 7 wickets | Sakshi
Sakshi News home page

చెలరేగిన చరణ్‌సాయి తేజ

Published Tue, Oct 8 2013 11:31 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

charansai teja took 7 wickets

సాక్షి, హైదరాబాద్: చరణ్‌సాయి తేజ బంతితో విజృంభించడంతో... ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ చాంపియన్‌షిప్‌లో కొసరాజు జట్టు ఘనవిజయం నమోదు చేసింది. గెలాక్సీతో జరిగిన ఈ మ్యాచ్‌లో కొసరాజు 372 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచింది. కొసరాజు జట్టు బౌలర్ చరణ్‌సాయి తేజ 24 పరుగులకే 7 వికెట్లు పడగొట్టి గెలాక్సీ జట్టును దెబ్బతీశాడు. 489 పరుగుల లక్ష్యంతో రెండో రోజు బుధవారం బ్యాటింగ్‌కు దిగిన గెలాక్సీ 28.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది.
 
 శశిధర్ రావు (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు తొలి రోజు లోహిత్ (203), అజయ్ (143) సెంచరీలతో హోరెత్తించడంతో కొసరాజు జట్టు 3 వికెట్లకు 488 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ విజయంతో కొసరాజు ఖాతాలో ఐదు పాయింట్లు చేరాయి. మరో మ్యాచ్‌లో సత్యనారాయణ (6/35) బౌలింగ్‌లో చెలరేగడంతో ఉస్మానియా జట్టు రెండు వికెట్లు తేడాతో సాయిసత్యపై నెగ్గింది. 190 పరుగుల లక్ష్యం తో రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఉస్మానియా 53.3 ఓవర్లలో 8 వికెట్లకు 194 పరుగులు చేసింది. సంతోష్ (53), రామ్‌ప్రసాద్ (49) రాణించారు. ప్రతీక్ 4 వికెట్లు తీశాడు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోరు వివరాలు
 ఠ గౌడ్స్ ఎలెవన్: 404; టీమ్ స్పీడ్: 188 (సంతోష్ 68, నాగరాజ్ 5/57).
 ఠ తెలంగాణ: 158; న్యూబ్లూస్: 132 (భగత్ ప్రసాద్ 59, దత్త ప్రకాశ్ 37, అనురాగ్ 3/19).
 ఠ నిజామ్ కాలేజి: 215; బడ్డింగ్ స్టార్: 180 (వెంకటేశ్ 4/59, స్టీవెన్‌సన్ 3/18).
 ఠ క్రౌన్ : 121; హైదరాబాద్ టైటాన్స్: 99 (సందీప్ 8/34).
 ఠ విశాక: 223; మెగాసిటీ: 217 (అనిరుధ్ 42, శ్రీకర్ 65, మెహర్ ప్రసాద్ 5/67).
 ఠ ఎంసీసీ: 271; చార్మినార్: 209/7 (జితేందర్ 45, అమోది 72 నాటౌట్, వినయ్ 3/62(వర్షం కారణంగా మ్యాచ్‌లో ఫలితం రాలేదు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement