ప్రియుడి వద్దకు తీసుకు వెళ్తానని...
మదనపల్లె: స్నేహితుడి వద్దకు తీసుకువెళ్తా..ఇద్దరికీ పెళ్లి చేస్తానని మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు. పదిరోజులపాటు బెంగళూరులోని ఓ గదిలో నిర్బంధించి పలుమార్లు లైంగికదాడి చేశాడు. జరిగిన అవమానం తట్టుకోలేక ఆ బాలిక ఆదివారం రాత్రి ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలంలో చోటుచేసుకుంది.
వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం ఏడాది కిందట చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చింది. వీరి కుమార్తె (14) నాయనమ్మ ఇంట్లో ఉంటూ 8వ తరగతి చదువుతోంది. బాలికి స్వగ్రామానికి చెందిన సాయితో ప్రేమం బంధం ఏర్పడింది. ఇది తెలిసి తల్లిదండ్రులు కుమార్తెను తమవద్దే ఉంచుకున్నారు. కొన్ని రోజుల తర్వాత బాలికను కలిసేందుకు సాయి వచ్చాడు. ఇది చూసిన బాలిక తల్లిదండ్రులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. బసినికొండకు చెందిన విజయ్ అటుగా వెళుతూ విషయాన్ని గమనించాడు. సాయిని వేరే ప్రాంతంలో విడిచిపెట్టాడు.
బాలికతో పరిచయం పెంచుకుని సాయి వివాహం చేస్తానని నమ్మబలి బెంగళూరుకు తీసుకువెళ్లాడు. ఓ అద్దెగదిలో ఉంచి బెదిరించి పదిరోజుల పాటు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలికను పోషించడం భారమై తిరిగి మదనపల్లెకు తీసుకువచ్చి వదిలి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లి పోయాడు. అవమానం భరించలేక ఆదివారం రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. బంధువులు ఆమెను మదనపల్లె ఆస్పత్రికి తరలించా రు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.