Ganesh festival committees
-
రోడ్డు పాడైందని ఆ ‘బడా గణేష్’ కమిటీకి భారీగా ఫైన్!
ముంబై: ఈ నెల తొలివారంలో దేశమంతా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడు పదోరోజు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఉత్సవాలు ముగిసిన వారం తర్వాత ముంబై నగర పాలక సంస్థ చేసిన పని ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. ముంబైలోని ప్రముఖ లాల్బాగ్చా రాజా గణేష్ ఉత్సవాల నిర్వహణ కమిటీకి భారీ జరిమానా విధించింది. మీ గణేష్ ఉత్సవాల కారణంగా రహదారిపై 183 గుంతలు పడి రోడ్డంతా పాడైపోయిందని నోటీసులు ఇచ్చింది. ఒక్కో గుంతకు రూ.2,000 చొప్పున మొత్తం రూ.3.66 లక్షలు చెల్లించాలని ఆదేశించింది బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ). గణేష్ ఉత్సవాలు ముగిసిన తర్వాత నగర పాలక సంస్థ అధికారులు తనిఖీలు చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. లాల్బాగ్చా రాజా గణేష్ ఉత్సవ కమిటీకి పంపించిన లేఖలో.. డాక్టర్ బాబాసాహేబ్ రోడ్ నుంచి టీబీ కడమ్ మార్గ్ వరకు రోడ్డు మొత్తం పాడైపోయిందని తెలిపింది బీఎంసీ ఈవార్డ్ కార్యాలయం. ఇదీ చదవండి: సీఎం ముఖచిత్రంతో ‘పేసీఎం’.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్ అస్త్రం! -
నేడు నిమజ్జనం
వినాయక చవితి రోజు ఊరూరా.. వాడవాడలా కొలువుదీరిన లంబోదరుడు భక్తుల విశేషపూజలందుకున్నాడు. బుధవారంతో నవరాత్రోత్సవాలు ముగుస్తుండడంతో సాయంత్రం నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కరీంనగర్, గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, మంథని, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి తదితర ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం కోసం అధికారయంత్రాంగంతోపాటు గణేష్ ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేశాయి.