Gang rape in Delhi
-
స్కూల్ టాయిలెట్లోకి లాక్కెళ్లి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేంద్రీయ విద్యాలయంలో జూనియర్‌పై ఇద్దరు సీనియర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాఠశాల వాష్ రూమ్‌లోకి 11 ఏళ్ల బాలికను తీసుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. మరోవైపు.. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రాంతీయ కార్యాలయం సైతం అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది జులైలోనే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు సీనియర్లు. సీనియర్ల దుశ్చర్య ఢిల్లీ మహిళా కమిషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. మహిళా కమిషన్ ప్రోత్సాహంతో బాధిత కుటుంబం గత మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్ పోలీసులు, పాఠశాల ప్రిన్సిపాల్‌కి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. ‘ఢిల్లీ స్కూల్లో 11 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ చాలా తీవ్రమైన కేసు గురించి తెలిసింది. ఈ విషయాన్ని స్కూల్ టీచర్ దాచి పెట్టే ప్రయత్నం చేసినట్లు బాధితురాలు తెలిపింది. దేశ రాజధానిలో పిల్లలకు స్కూల్స్ కూడా సురక్షితం కాకపోవటం దురదృష్టకరం. నిందితులను కఠినంగా శిక్షించాలి. బాధితురాలు క్లాస్ రూమ్‌లోకి వెళ్లే క్రమంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అడ్డుకున్నారు. టాయిలెట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని టీచర్‌కు తెలపగా.. దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ’ అని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వెల్లడించారు. ఇదీ చదవండి: మెక్సికోలో కాల్పుల మోత.. మేయర్ సహా 18 మంది మృతి -
అంతా 12 ఏళ్ల లోపువారే.. స్నేహితుడిపైనే దారుణంగా..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సీలాంపుర్ ప్రాంతంలో ముగ్గురు బాలురు తన స్నేహితుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన బాధిత 10 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు వెల్లడించేందుకు తొలుత కుటుంబ సభ్యులు నిరాకరించగా.. పోలీసుల కౌన్సిలింగ్‌తో జరిగిన దారుణాన్ని వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 18న బాధిత బాలుడిపై ముగ్గురు మైనర్ స్నేహితులు లైంగికంగా వేధించారు. దాడి జరిగిన మూడు రోజులకు బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించేందుకు ప్రయత్నించినా బాలుడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని తల్లి వివరించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడు కొన్ని రోజులు చికిత్సకు స్పందించినా.. శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ఇద్దరు జువైనల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే, తల్లిదండ్రుల హామీతో వారిని విడుదల చేయాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది. మరో బాలుడిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పోక్సో, ఐపీసీ సెక్షన్ 377,34 ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసిన మైనర్లు సైతం 10-12 ఏళ్ల వారేనని వెల్లడించారు. ఇదీ చదవండి: వైద్యులు బతకడన్నారు.. ఇప్పుడు 18వ బర్త్‌డే చేసుకుంటున్నాడు! -
గదిలో బంధించి.. మద్యం తాగించి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో అబల ఆక్రందన ఇది. ముంబైకి చెందిన 26 ఏళ్ల యువతిని సెంట్రల్ ఢిల్లీ రాజేందర్ నగర్‌లోని ఓ గదిలో ఇద్దరు వ్యక్తులు బంధించారు. ఆమెతో బలవంతంగా మద్యాన్ని తాగించి.. గత గురువారం మధ్య రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడైన కాంట్రాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు స్థానిక మున్సిపాలిటీలో ఎగ్గిక్యూటివ్ ఇంజినీర్ అని తెలుస్తోంది. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రైవేటు అంగాలలో తీవ్ర గాయాలు కావడంతో బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ఓ స్వచ్ఛంద సంస్థతో కౌన్సెలింగ్ కూడా ఇప్పించారు. బాధితురాలితో నిందితులు అసహజ రీతిలో శృంగారానికి పాల్పడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్లో గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. ఫేస్బుక్లో పరిచయం! బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. ముంబైకి చెందిన ఆమె ఏడు నెలల కిందట ఢిల్లీకి వచ్చింది. ఇక్కడ సఫ్దర్ జంగ్ ప్రాంతంలో అద్దెకు ఉంటోంది. నిందితుడైన కాంట్రాక్టర్ మనీష్ ఆమెకు మొదట ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. ఇద్దరు తరచూ చాటింగ్ చేసేవారు. ఆ తర్వాత మొబైల్ నంబర్లు కూడా పరస్పరం ఇచ్చుకొని మాటలు కొనసాగించారు. ఈ క్రమంలో మనీష్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఢిల్లీకి రప్పించాడు. ఢిల్లీకి వస్తే తన ఖర్చులన్నీ భరిస్తానని, తనను చూసుకుంటానని అతడు హామీ ఇచ్చినట్టు ఆమె ఎఫ్ఐఆర్లో తెలిపింది. ఘటన జరిగిన రోజు పెళ్లి గురించి మాట్లాడుదామని బాధితురాలిని మనీష్ తన గదికి పిలించాడు. ఆ సమయంలో అతనితోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి బాధితురాలిపై బలాత్కరం చేయబోయాడు. దానిని ప్రతిఘటించి మనీష్‌కు తెలుపగా.. అతడు ఆమెను దుర్భాషలాడాడు. ఇద్దరు కలిసి గదిలో ఆమెను బంధించి.. బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. అతి కష్టం మీద వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.