అబుసలేంను థానే జైలుకు తరలింపు
హైదరాబాద్ : నకిలీ పాస్‌పోర్టుల కేసులో ఏడేళ్లు శిక్ష పడిన మాఫియా డాన్ అబూసలేంను పోలీసులు మహరాష్ట్ర థానే జైలుకు తరలించారు. ఇప్పటికే అబూ సలేం 6 సంవత్సరాల 10 రోజులు జైలుశిక్ష అనుభవించాడు. పన్నెండేళ్ల తర్వాత అబూసలేం కేసులో నాంపల్లి కోర్టు గురువారం తుది తీర్పును వెల్లడించింది. అబూసలేంపై 120 (బి), 490, 471 సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారమే ఈ కేసులో అబూసలేంను దోషిగా నిర్థారించారు. ఇదే కేసులో సినీ నటి మోనికా బేడి మూడేళ్ల జైలుశిక్ష అనుభవించింది.