Gaptil
-
సెమీఫైనల్లో న్యూజిలాండ్
పాకిస్తాన్‌పై 22 పరుగులతో విజయం గప్టిల్ మెరుపు ఇన్నింగ్స్ మొహాలీ: ఈసారి టి20 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతున్న న్యూజిలాండ్ జట్టు వరుసగా మూడో విజయం సాధించింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీఫైనల్‌కు చేరింది. పీసీఏ మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కివీస్ 22 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 180 పరుగులు చేసింది. ఓపెనర్ గప్టిల్ (48 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ విలియమ్సన్ (17), అండర్సన్ (21) గప్టిల్‌కు అండగా నిలిచారు. చివరి ఓవర్లలో రాస్ టేలర్ (23 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడటంతో కివీస్ భారీస్కోరు సాధించింది. పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఓపెనర్ షార్జీల్ ఖాన్ (25 బంతుల్లో 47; 9 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో పాటు మరో ఓపెనర్ షెహ్జాద్ (32 బంతుల్లో 30; 3 ఫోర్లు) కూడా రాణించడంతో పాక్‌కు మెరుపు ఆరంభం లభించింది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు కేవలం 33 బంతుల్లోనే 65 పరుగులు జోడించడం విశేషం. అయితే ఆ తర్వాత న్యూజిలాండ్ బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. పాక్ చేతిలో వికెట్లు ఉన్నా... న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేయడంతో పాక్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయలేకపోయారు. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశాలు బాగా క్లిష్టమయ్యాయి. భారత్, ఆస్ట్రేలియాలలో ఒక జట్టుకు ఈ గ్రూప్ నుంచి రెండో సెమీస్ బెర్త్‌ను సాధించే అవకాశం ఉంది. స్కోరు వివరాలు: న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (బి) సమీ 80; విలియమ్సన్ (సి) ఆఫ్రిది (బి) ఇర్ఫాన్ 17; మున్రో (సి) లతీఫ్ (బి) ఆఫ్రిది 7; అండర్సన్ (సి) మాలిక్ (బి) ఆఫ్రిది 21; టేలర్ నాటౌట్ 36; రోంచీ (సి) మాలిక్ (బి) సమీ 11; ఇలియట్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1-62; 2-75; 3-127; 4-132; 5-164. బౌలింగ్: ఆమిర్ 4-0-41-0; ఇర్ఫాన్ 4-0-46-1; సమీ 4-0-23-2; ఇమాద్ 4-0-26-0; ఆఫ్రిది 4-0-40-2. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షార్జీల్ (సి) గప్టిల్ (బి) మిల్నే 47; షెహ్జాద్ (సి) గప్టిల్ (బి) శాంట్నర్ 30; లతీఫ్ (సి) ఇలియట్ (బి) శాంట్నర్ 3; ఉమర్ అక్మల్ (సి) గప్టిల్ (బి) మిల్నే 24; ఆఫ్రిది (సి) అండర్సన్ (బి) సోధి 19; షోయబ్ మాలిక్ నాటౌట్ 15; సర్ఫరాజ్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1-65; 2-79; 3-96; 4-123; 5-140. బౌలింగ్: శాంట్నర్ 4-0-29-2; అండర్సన్ 2-0-14-0; మిల్నే 4-0-26-2; మెక్లీనగన్ 4-0-43-0; ఇలియట్ 2-0-16-0; సోధి 4-0-25-1. -
కివీస్‌దే తొలి వన్డే
రాణించిన గప్టిల్, మెకల్లమ్ క్రైస్ట్‌చర్చ్: లక్ష్య ఛేదనలో గప్టిల్ (56 బంతుల్లో 79; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ మెకల్లమ్ (25 బంతుల్లో 55; 11 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడటంతో... శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. హగ్లే ఓవల్ మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 47 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. సిరివందన (82 బంతుల్లో 66; 7 ఫోర్లు), కులశేఖర (73 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మినహా మిగతా వారందరూ విఫలమయ్యారు. పేసర్ మ్యాట్ హెన్రీ (4/49) ధాటికి లంక టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. బ్రాస్‌వెల్ 3, మెక్లీంగన్ 2 వికెట్లు తీశారు. తర్వాత కివీస్ 21 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసి నెగ్గింది.