కివీస్‌దే తొలి వన్డే | McCullum blitzes Sri Lanka as Black Caps race to victory | Sakshi
Sakshi News home page

కివీస్‌దే తొలి వన్డే

Published Sun, Dec 27 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

కివీస్‌దే తొలి వన్డే

కివీస్‌దే తొలి వన్డే

రాణించిన గప్టిల్, మెకల్లమ్
 క్రైస్ట్‌చర్చ్:
లక్ష్య ఛేదనలో గప్టిల్ (56 బంతుల్లో 79; 9 ఫోర్లు, 4 సిక్సర్లు),  కెప్టెన్ మెకల్లమ్ (25 బంతుల్లో 55; 11 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడటంతో... శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. హగ్లే ఓవల్ మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 47 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. సిరివందన (82 బంతుల్లో 66; 7 ఫోర్లు), కులశేఖర (73 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మినహా మిగతా వారందరూ విఫలమయ్యారు. పేసర్ మ్యాట్ హెన్రీ (4/49) ధాటికి లంక టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. బ్రాస్‌వెల్ 3, మెక్లీంగన్ 2 వికెట్లు తీశారు. తర్వాత కివీస్ 21 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసి నెగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement