Gene-Editing
-
ఆ ఆవాల వెనుక బలమైన కారణం ఉందా? కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: జన్యుమార్పిడి చేసిన(జీఎం) ఆవాలను (హైబ్రిడ్ డీఎంహెచ్–11) మార్కెట్లో విడుదల చేయడం వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో జన్యుమార్పిడి విత్తనాలపై నిషేధం విధించాలని కోరుతూ సామాజిక కార్యకర్త అరుణా రోడ్రిగ్స్, ‘జీన్ క్యాంపెయిన్’ అనే ఎన్జీవో దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. జన్యుమార్పిడి విత్తనాల గురించి మన దేశంలో రైతులకు పెద్దగా అవగాహన లేదని గుర్తుచేసింది. ఇలాంటి విత్తనాలతో నష్టాలు ఉంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు వినిపించారు. జన్యుమార్పిడి పంటలను సామాజిక కార్యకర్తలు, కొందరు నిపుణులు సిద్ధాంతపరమైన కారణాలతో వ్యతిరేకిస్తున్నారని, శాస్త్రీయ, హేతుబద్ధతతో కూడిన కారణాలతో కాదని చెప్పారు. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. డీఎంహెచ్–11 ఆవాలను సెంటర్ ఫర్ జెనెటిక్ మ్యానిప్యులేషన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్∙అభివృద్ధి చేసింది. -
‘జీన్ ఎడిటింగ్’ శాస్త్రవేత్తపై చైనా నిషేధం
బీజింగ్: జన్యువుల్ని ఎడిటింగ్ చేసి ఇద్దరు బేబీల్ని సృష్టించిన వివాదాస్పద చైనా శాస్త్రవేత్త నిషేధానికి గురయ్యాడు. ఈ ప్రయోగంపై దేశవిదేశాల నుంచి విమర్శలు తలెత్తడంతో ఆయన ఇకపై ఎలాంటి శాస్త్రీయ పరిశోధన చేయకుండా చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఫలదీకరణ చెందిన అండ కణాల నుంచి ఎయిడ్స్ నిరోధకత కలిగిన బేబీని సృష్టించాలని హీ జియాన్కుయ్ పరిశోధన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హెచ్ఐవీ వైరస్‌ను శరీరంలోనికి అనుమతించే ప్రొటీన్ కారక జన్యువుని నిర్వీర్యం చేసి, ఇద్దరు బేబీలకు ఐవీఎఫ్ పద్ధతిలో జీవం పోసినట్లు ఆయన ఇటీవల ప్రకటించడం సంచలనం సృష్టించింది. మరోవైపు, బుధవారం హాంకాంగ్‌లో జరిగిన ఓ సదస్సులో జియాన్కుయ్ తన ప్రయోగం పట్ల గర్వపడుతున్నట్లు చెప్పారు. హెచ్ఐవీ బాధితులకు తాను సాయం చేస్తున్నట్లు తెలిపారు. -
జీన్ ఎడిటింగ్‌తో జననం.. వినాశనం తప్పదు!
హాంగ్‌కాంగ్: చైనాలోని షెంజెన్‌కు చెందిన పరిశోధకుడు హే జియాంకుయ్ సంచలన ప్రకటన చేశారు. తాను మానవ పిండాల్లో జీన్ ఎడిటింగ్ చేపట్టాననీ, తద్వారా ఈ నెలలో ఇద్దరు చిన్నారులు జన్మించారని బాంబు పేల్చారు. ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన శాస్త్రవేత్త డా.మైకెల్ డీమ్ పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా మనుషుల డీఎన్ఏలోని వ్యాధికారక జన్యువులను తొలగించి, ఆరోగ్యకరమైన జన్యవులను చేర్చుకోవచ్చు. తద్వారా భవిష్యత్ తరాలకు అస్సలు ఎలాంటి వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు. అంతేకాదు.. తమ కుమారుడు లేదా కుమార్తె జుట్టు రంగు, ఎత్తు, శరీర ఛాయ, ఎలా ఉండాలో పిండం దశలోనే నిర్ణయించవచ్చు. అయితే ఈ ప్రక్రియను ఎవరైనా దుర్వినియోగం చేసి రోగాలు, అలసట, ముసలితనం, చావు అంటూలేని శక్తిమంతమైన మనుషులను తయారుచేస్తే మానవజాతి మొత్తం అంతరించిపోతుందన్న భయంతో అమెరికా, చైనా సహా పలు ప్రపంచదేశాలు జీన్ ఎడిటింగ్‌ను నిషేధించాయి. అయితే చైనాలో పిండాల్లో జీన్ ఎడిటింగ్ చేయడంపై ఎలాంటి నిషేధం లేదు. హెచ్ఐవీ దంపతుల ఎంపిక తాజాగా ఈ విషయమై జియాంకుయ్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం కోసం హెచ్ఐవీ/ఎయిడ్స్ సోకిన దంపతులను ఎంపిక చేసుకున్నామని తెలిపారు. ఫలదీకరణం తర్వాత మూడు నుంచి 5 రోజుల వయసున్న పిండాలను ఎడిట్ చేసి ఎయిడ్స్ సోకేందుకు కారణమయ్యే సీసీఆర్5 అనే ప్రొటీన్‌ను పిండాల నుంచి తొలగించామని వెల్లడించారు. ఈ ప్రక్రియను ముందుగా ఎలుకలు, కోతులపై పరీక్షించాకే మనుషుల్లో చేపట్టామన్నారు. పుట్టిన ఇద్దరు బాలికల్లో ఒకరిలో మార్పిడి చేసిన రెండు జన్యువులు ఉండగా, మరో చిన్నారిలో ఒకే జన్యువు ఉందన్నారు. హాంకాంగ్‌లో మంగళవారం జీన్ ఎడిటింగ్ సదస్సు నేపథ్యంలో జియాంకుయ్ చేసిన ఈ ప్రకటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ ప్రయోగం మానవాళికి వినాశకరంగా మారుతుందనీ, సమాజంలో నైతిక విలువలు పడిపోతాయని చాలామంది శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యాధి నిరోధక లక్షణాలు భవిష్యత్ తరాలకు వారసత్వంగా సంక్రమిస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, మరికొందరు ఈ మొత్తం ప్రక్రియపైనే సందేహాలు వ్యక్తం చేశారు. -
జీన్ ఎడిటింగ్ ద్వారా నయమయ్యే
ఎన్నెన్నో వ్యాధులు! ఇక్కడ వివరించే అంశాల పూర్తిగా సాంకేతికం. ఇక్కడ చెప్పినంత సులభం కాకపోవచ్చు. అయితే అందరికీ అర్థం కావడం కోసం కాస్త తేలిక భాషలో చెప్పుకుందాం. పత్రికా రచన, పుస్తకాల ప్రచురణ సమయంలో ఇతరులకు అర్థం కావడం కోసం కొంత తొలగిస్తారు. కానీ అది లేకపోయినా పాఠకులకు అర్థం అవుతుంది. అలాగే సినిమాలోనూ చాలా భాగాన్ని తీసేసి, నిర్ణీత సమయంలో ఎంత చూపగలరో అంతకు కుదిస్తారు. కొన్ని చోట్ల కొన్ని మార్పులు చేస్తారు. కొంత పాఠ్యభాగాలను ముందుకూ, వెనక్కూ చేస్తారు. అలాగే సినిమాలో సీన్స్ కూడా. ఇదే ప్రక్రియ జన్యువులోని పదార్థమైన డీఎన్ఏలోనూ జరిగితే! అది డీఎన్ఏ-ఎడిటింగ్. చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. కానీ మనకు అర్థం కావడం కోసం ఇలా చెప్పుకున్నాం. ఇలా డీఎన్ఏ-ఎడిటింగ్ చేసే ప్రక్రియ ఇప్పటివరకూ చాలా పరిశోధన స్థాయిలోనే ఉంది. కానీ ఈ పరిశోధన వల్ల ఒనగూరే ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువేనని అంటున్నారు సాల్క్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు. ఉదాహరణకు గుండె, కన్ను, కాలేయం, మెదడు లాంటి అవయవాల్లోని కణాలలో ఉండే మూల పదార్థమైన జీన్‌లోని డీఎన్ఏలు చెడిపోతే వాటిని బాగు చేయడం సాధ్యం కాదు. కానీ ఈ పరిశోధనల తర్వాత వాటిలోనూ మార్పు చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల చేకూరే ప్రయోజనాలు చాలా ఎక్కువ. దీని వల్ల జరిగే మేలు గురించి చిన్న ఉదాహరణగా అంధత్వం వచ్చిన వారి కళ్లు మళ్లీ మామూలుగానే అయ్యేలా చేసి, చూపు తెప్పించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టెక్నిక్‌ను ‘హైటై’ అంటున్నారు. ఈ పరిశోధనల సహాయంతో ల్యాబ్‌లో కనుచూపులేని కొన్ని ఎలుకలకు కొంతవరకు చూపు తెప్పించగలిగారు. ‘‘ఇప్పటికి మనం చేస్తున్నది చాలా తక్కువ. దీని గురించి ఇంకా తెలుసుకోవాల్సించి చాలా ఉంది’’ అంటారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకుంటున్న డాక్టర్ బెల్మాంటె.