జీన్ ఎడిటింగ్ ద్వారా నయమయ్యే
జీన్ ఎడిటింగ్ ద్వారా నయమయ్యే
Published Sun, Nov 27 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
ఎన్నెన్నో వ్యాధులు!
ఇక్కడ వివరించే అంశాల పూర్తిగా సాంకేతికం. ఇక్కడ చెప్పినంత సులభం కాకపోవచ్చు. అయితే అందరికీ అర్థం కావడం కోసం కాస్త తేలిక భాషలో చెప్పుకుందాం. పత్రికా రచన, పుస్తకాల ప్రచురణ సమయంలో ఇతరులకు అర్థం కావడం కోసం కొంత తొలగిస్తారు. కానీ అది లేకపోయినా పాఠకులకు అర్థం అవుతుంది. అలాగే సినిమాలోనూ చాలా భాగాన్ని తీసేసి, నిర్ణీత సమయంలో ఎంత చూపగలరో అంతకు కుదిస్తారు. కొన్ని చోట్ల కొన్ని మార్పులు చేస్తారు. కొంత పాఠ్యభాగాలను ముందుకూ, వెనక్కూ చేస్తారు. అలాగే సినిమాలో సీన్స్ కూడా. ఇదే ప్రక్రియ జన్యువులోని పదార్థమైన డీఎన్‌ఏలోనూ జరిగితే! అది డీఎన్‌ఏ-ఎడిటింగ్. చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. కానీ మనకు అర్థం కావడం కోసం ఇలా చెప్పుకున్నాం. ఇలా డీఎన్‌ఏ-ఎడిటింగ్ చేసే ప్రక్రియ ఇప్పటివరకూ చాలా పరిశోధన స్థాయిలోనే ఉంది.
కానీ ఈ పరిశోధన వల్ల ఒనగూరే ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువేనని అంటున్నారు సాల్క్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు. ఉదాహరణకు గుండె, కన్ను, కాలేయం, మెదడు లాంటి అవయవాల్లోని కణాలలో ఉండే మూల పదార్థమైన జీన్‌లోని డీఎన్‌ఏలు చెడిపోతే వాటిని బాగు చేయడం సాధ్యం కాదు. కానీ ఈ పరిశోధనల తర్వాత వాటిలోనూ మార్పు చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల చేకూరే ప్రయోజనాలు చాలా ఎక్కువ. దీని వల్ల జరిగే మేలు గురించి చిన్న ఉదాహరణగా అంధత్వం వచ్చిన వారి కళ్లు మళ్లీ మామూలుగానే అయ్యేలా చేసి, చూపు తెప్పించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టెక్నిక్‌ను ‘హైటై’ అంటున్నారు. ఈ పరిశోధనల సహాయంతో ల్యాబ్‌లో కనుచూపులేని కొన్ని ఎలుకలకు కొంతవరకు చూపు తెప్పించగలిగారు. ‘‘ఇప్పటికి మనం చేస్తున్నది చాలా తక్కువ. దీని గురించి ఇంకా తెలుసుకోవాల్సించి చాలా ఉంది’’ అంటారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకుంటున్న డాక్టర్ బెల్మాంటె.
Advertisement
Advertisement