వ్యభిచారం డిస్కౌంట్ ఆఫర్లపై నిషేధం!
దేశంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళలకు ప్రభుత్వం తరఫున అందిస్తున్న డిస్కాంట్లను నిలుపుదల చేయాలని జర్మనీలోని రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. అందుకు సంబంధించిన ప్రణాళికులు సిద్ధం చేసినట్లు సెంటర్ లెఫ్ట్ సోషల్ డెమెక్రటిక్స్ పార్టీ అధికార ప్రతినిధి అంజ స్ట్రయిడర్ ఇక్కడ వెల్లడించారు. త్వరలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కలసి ఆ విషయంపై సంప్రదింపులు జరుపుతామని తెలిపారు.
2002 వ సంవత్సరంలో దేశంలో వ్యభిచారాన్ని జర్మనీ ప్రభుత్వం చట్టబద్దం చేసింది. దాంతో వ్యభిచారం పేరుతో నిర్వహకులు దోపిడి పాల్పడుతున్నారని, ఆ క్రమంలో వ్యభిచార గృహాల నిర్వహకులు ఆగడాలు శృతి మించుతున్నాయని దేశ్యవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి.
వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో రాజకీయపార్టీలు జర్మనీ రాజధాని బెర్లిన్‌లో సోమవారం సమావేశమైనాయి. దాంతో దేశం వ్యభిచారానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీ (డిస్కోంట్) నిలిపివేయాలని ఆ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఆ ఆమోదాన్ని సాధ్యమైనంత త్వరలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు అందజేయనున్నాయి.