మెహిందీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ : మెరిసిపోయిన అందాల భామ
పాకిస్తానీ హీరోయిన్ మావ్రా హొకేన్(Mawra Hocane) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తొలుత బుల్లితెరపై కనిపించిన మావ్రా ఆ తరువాత హీరోయిన్గా రాణించింది. ఇప్పటికే తన డ్రీమీ వెడ్డింగ్ ఫోటోలతో ఇంటర్నెట్లో సందడి చేసిన ఈ అమ్మడు తాజాగా తన మెహిందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఆమె ఫ్యాషన్ శైలికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అమీర్ గిలానీ(Ameer Gilani)ని ఇటీవల(ఫిబ్రవరి 5న) రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు హాజరైన వివాహానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇపుడు మెహిందీ లగాకే రఖ్లీ అంటూ, మెహందీ వేడుక నుండి అనేక చిత్రాలను పోస్ట్ చేసింది. ఇందులో అప్సరసలా మెరిసిపోయింది. View this post on Instagram A post shared by MAWRA (@mawrellous) గోల్డెన్ టోన్ ఎంబ్రాయిడరీ మస్టర్డ్ ఎల్లో -టోన్ ఘరారా సెట్‌ను ధరించింది.. దీనికి చిన్న ఫ్రాక్-శైలి కుర్తాతో పాటు ఫ్లేర్డ్ ఘరారాను జత చేసింది. అంతేకాదు డబుల్-దుపట్టా లుక్ లేటెస్ట్ ట్రెండ్‌కు అద్దం పడింది. మెజెంటా దుపట్టా , ఇంకోటి పర్పుల్ అండ్ బంగారు రంగు దుపట్టాను లుక్‌ను జత చేసింది. ఇక దీనికి జతగా బంగారు ఆభరణాలు, సింపుల్ మేకప్ లుక్తోతన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది మావ్రా. మావ్రా హొకేన్ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో ఎంబ్రాయిడరీ చేసిన సేజ్ గ్రీన్ షరారా సెట్లో అందంగా మెరిసింది.కాగా మావ్రా 2011లో ఈ అమ్మడు ‘కిచారి సాల్స’(Kichari Salsa) బాలీవుడ్ రొమాంటిక్ మూవీతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తరువత 2016లో ‘సనమ్ తేరీ కసమ్’ (Sanam Teri Kasam)తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.