Ghanta Chakra Pani
-
1,917 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటనలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మంగళవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలసి 2016–17కి సంబంధించిన సంస్థ వార్షిక నివేదికను అందజేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా 40,921 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతిచ్చిందని, 93 నియామక ప్రకటనలు, 28 శాఖాపర, ఆర్ఐఎంసీ, సీఏఎస్ ప్రకటనలు కలిపి మొత్తం 121 ప్రకటనలు జారీ చేశామన్నారు. ఇప్పటివరకు 128 గ్రూప్–1 పోస్టులు, 36,076 ఇతర పోస్టులు కలిపి మొత్తం 36,204 పోస్టుల భర్తీకి ప్రకటనలిచ్చామని తెలిపారు. 12,749 ఉద్యోగాల భర్తీ పూర్తయిందని తెలిపారు. 20,360 పోస్టులకు సంబంధించిన ఫలితాల ప్రకటనల జారీ/ నియామక పరీక్షల తర్వాతి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 3,095 పోస్టులకు సంబంధించిన నియామక పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నామని, 1,917 పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ చేయాల్సి ఉందన్నారు. 2,343 పోస్టుల నియామక ప్రకటనలను టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకుందన్నారు. -
టీఎస్పీఎస్సీ చైర్మన్ వైఖరితోనే స్టేలు
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శ సాక్షి, సంగారెడ్డి: టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వైఖరి వల్లే నిరుద్యో గులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ నేత తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు. సంగారెడ్డిలో మంగళవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ.. ఘంటా చక్రపాణి సీఎం కుటుంబసభ్యులకు వంత పాడుతూ.. వారు చెప్పిన వ్యక్తులకే ఉద్యోగాలు ఇస్తు న్నారని ఆరోపించారు. చక్రపాణి నియంతలా వ్యవహరిస్తూ.. టీఎస్పీ ఎస్సీని భ్రష్టు పట్టిస్తున్నారని మండిప డ్డారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనందునే లోప భూయిష్టమైన నోటిఫికేషన్లపై కోర్టులు స్టేలు విధిస్తున్నా యని పేర్కొన్నారు. ఓడీఎఫ్, బీహెచ్ ఈఎల్, బీడీఎల్‌లలో స్థానికులకు ఉద్యో గాలు దక్కేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి)ని సవరించేందుకు కేసీఆర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రి హరీశ్ చొరవ చూపాలని ఆయన కోరారు. -
‘ఘంటా’ దిష్టిబొమ్మ దహనం
నిర్మల్ అర్బన్: గ్రూప్-2 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఆధ్వర్వంలో శుక్రవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఓఎంఆర్ షీట్లపై ఫొటోలు వేయకపోవడం, కోడింగ్, డీకోడింగ్ లేకపోవడం, అనుభవం లేని ఇన్విజిరేటర్లు విధులు నిర్వహించారన్నారు. బయోమెట్రిక్ విధానంలో విఫలం, 40శాతం అభ్యర్థుల వేలిముద్రలు మాత్రమే తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గ్రూప్ - 2లో కొన్ని ప్రశ్నలు నక్సలైట్ నాయకుల పేర్లను, నక్సలైట్ల ఎన్కౌంటర్, జనశక్తి సంఘాల గురించి ఉన్నాయని, దీంతో అభ్యర్థుల్లో నక్సలిజం భావాలను పెంచారని ఆరోపించారు. వెంటనే చైర్మన్ పదవి నుంచి ఘంటా చక్రపాణిని తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అజీమ్, రాకేశ్‌రెడ్డి, నిఖిల్, వినీత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.