టీఎస్‌పీఎస్సీ చైర్మన్ వైఖరితోనే స్టేలు
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శ
సాక్షి, సంగారెడ్డి: టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వైఖరి వల్లే నిరుద్యో గులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ నేత తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు. సంగారెడ్డిలో మంగళవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ.. ఘంటా చక్రపాణి సీఎం కుటుంబసభ్యులకు వంత పాడుతూ.. వారు చెప్పిన వ్యక్తులకే ఉద్యోగాలు ఇస్తు న్నారని ఆరోపించారు. చక్రపాణి నియంతలా వ్యవహరిస్తూ.. టీఎస్‌పీ ఎస్సీని భ్రష్టు పట్టిస్తున్నారని మండిప డ్డారు.
ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనందునే లోప భూయిష్టమైన నోటిఫికేషన్లపై కోర్టులు స్టేలు విధిస్తున్నా యని పేర్కొన్నారు. ఓడీఎఫ్, బీహెచ్ ఈఎల్, బీడీఎల్‌లలో స్థానికులకు ఉద్యో గాలు దక్కేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి)ని సవరించేందుకు కేసీఆర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రి హరీశ్ చొరవ చూపాలని ఆయన కోరారు.