Ghatal
-
బీజేపీ అభ్యర్థిపై తృణమూల్ కార్యకర్తల దాడి
-
తృణమూల్ దౌర్జన్యం : బీజేపీ మహిళా అభ్యర్ధి కన్నీరు
కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌లోనూ పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి, పశ్చిమ బెంగాల్‌లోని ఘతాల్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి భారతి ఘోష్‌పై ఓ పోలింగ్ కేంద్రం వద్ద దాడి జరిగింది. పోలింగ్ ఏజెంట్‌తో కలిసి బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన భారతి ఘోష్‌ను తృణమూల్ కాంగ్రెస్ మహిళా విభాగం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఘోష్‌ను చుట్టుముట్టిన తృణమూల్ శ్రేణులు ఆమెను తోసివేయడంతో కిందపడిపోయారు. తనపై తృణమూల్ కార్యకర్తలు దాడి చేయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు ఆరో దశ పోలింగ్ సందర్భంగా బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా మొబైల్ ఫోన్‌తో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన భారతి ఘోష్ వీడియో తీశారనే ఆరోపణలపై ఈసీ సంబంధిత పోలింగ్ అధికారులను నివేదిక కోరింది. కాగా పోలింగ్‌కు ముందు జరిగిన ఘర్షణలో ఓ బీజేపీ కార్యకర్త మరణించగా, పలువురు బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు గాయపడ్డారు. -
రేప్ కామెంట్స్ పై సారీ: దేవ్
ఎన్నికల బరిలో నిలబడటం, రేప్ (అత్యాచారం) రెండూ ఒకేలాంటవేనని తాను చేసిన వ్యాఖ్యలపై క్షమించాలని బెంగాలీ నటుడు దేవ్ ఆ రాష్ట్ర ప్రజలను కోరారు. తాను రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించానని, మహిళలను తల్లిగా, సోదరిగా గౌరవిస్తానని చెప్పారు. ప్రజల మనస్సులు గాయపరచడం తన ఉద్దేశ్యం కాదన్నారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనసులైనా గాయపడి ఉంటే క్షమించాలన్నారు.ఈ మేరకు దేవ్ సోమవారం ట్విటర్లో పోస్ట్ చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా, గట్టల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేవ్ బరిలో నిలిచారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవ్ మాట్లాడుతూ... ఎన్నిక బరిలో నిలబడటం, రేప్ రెండు ఒక లాంటివేనని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. దేవ్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేయడమే కాకుండా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో దేవ్ దిగి రాక తప్పలేదు.