GHMC Commissioner B Janardan Reddy
-
జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ఆదేశాలు!
సాక్షి, హైదరాబాద్: సోమవారం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అల్లాడిపోయింది. దీనికితోడు మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ బీ జనార్దన్‌రెడ్డి నగర పరిధిలోని ఏసీపీలకు, సిబ్బందికి కీలక సూచనలు జారీచేశారు. వరుస వర్షాల నేపథ్యంలో నగరంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, జీహెచ్ఎంసీ సూచనలు తప్పకుండా పాటించాలని నిర్దేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది, ఏసీపీలకు కమిషనర్ ఈ కింది కీలక ఆదేశాలు జారీచేశారు. మీ పరిధిలోని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ముఖ్యంగా శిథిలమైన భవనాలు, దెబ్బతిన్న కట్టడాలపై సత్వరమే చర్య తీసుకోండి. ప్రమాదకర స్థితిలో ఉన్న శిథిలమైన భవనాలను ఖాళీచేయించడం, సీల్ చేయడం లేదా కూల్చివేయండి. శిథిలమైన పురాతన కాంపౌండ్ వాల్స్, రిటైనింగ్ వాల్స్‌పై చర్య తీసుకోండి పురాతన ప్రభుత్వ పాఠశాల భవనాలను తనిఖీ చేయండి. వాటి పరిసరాల్లో ఎవరైనా ఉంటే ఖాళీ చేయించండి సెల్లార్ (గ్రౌండ్ ఫ్లోర్) తవ్వకాలను అనుమతించకండి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోండి. ఏసీపీలందరూ సెల్లార్ సైట్‌ను తనిఖీ చేయాలి. ఇప్పటికే సెల్లార్‌ను తవ్వి ఉంటే.. నేలను గట్టిపరచడం, నేయిలింగ్ వంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా యజమానులకు సూచించండి. సెల్లార్లను మరింతగా తవ్వకుండా నిలువరించండి. కొండప్రాంతాలైన బంజారాహిల్స్, జుబ్లీహిల్స్ మొదలైన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టండి. కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలను తప్పించేవిధంగా ప్రజలను అప్రమత్తం చేసి.. కొండ దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తరలించేందుకు వీలుగా చర్యలు తీసుకోండి. శిథిలమైన భవనాలకు నోటీసు బోర్డులు తగిలించండి. ప్రజలు వాటివద్దకు వెళ్లకుండా ఉండేలా బ్యారికేడ్లు పెట్టండి. పురాతన భవనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడండి. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది, యంత్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోండి. కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే అలర్ట్ మెసేజ్‌లు, ఐఎండీ, మీడియా నుంచి అందే వాతావరణ రిపోర్ట్స్ పట్ల అలర్ట్‌గా స్పందించండి. -
హలో కమిషనర్
నేడు ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ ►ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ►తడి–పొడి చెత్త విడాకులు, పారిశుధ్యం హైదరాబాద్ వివిధ రంగాల్లో ప్రపంచస్థాయి నగరాల సరసన నిలుస్తున్నప్పటికీ, వివిధ అంశాల్లో అగ్రస్థానంలో ఉంటున్నప్పటికీ, చెత్త–స్వచ్ఛతకు సంబంధించి సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఇందులో భాగంగా ఇంటింటికీ రెండు రంగుల చెత్తడబ్బాల పంపిణీ, చెత్త తరలింపునకు ఆటోటిప్పర్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా చర్యలు, పబ్లిక్ టాయ్లెట్ల పెంపు, షీ టాయ్లెట్లు, డ్రై రిసోర్స్ సెంటర్లు, సీఆర్పీల ఏర్పాటు,తదితర చర్యలెన్నో తీసుకున్నప్పటికీ ఇంకా బహిరంగంగా చెత్త కనిపిస్తూనే ఉంది. ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త వేరు కావడం లేదు.. నగరం స్వచ్ఛంగా కనిపించడం లేదు. స్వచ్ఛ భారత్ మిషన్ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 5న దేశంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఇళ్లనుంచి తడి,పొడి చెత్తను వేరుచేసే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ.. మరింత ముందుకెళ్తూ, మరింత విస్తృతంగా ఈనెల 5నుంచే శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యంలో చెత్తను వేరుచేయడం, పారిశుధ్య కార్యక్రమాల అమలు, తదితర అంశాల గురించి ప్రజల సందేహాలు నివృత్తి చేసేందుకు, ప్రజల సూచనలు స్వీకరించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అంగీకరించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో మీ అభిప్రాయాల్ని కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’ ద్వారా పంచుకోండి. గ్రేటర్ హైదరాబాద్‌ను స్వచ్ఛ హైదరాబాద్‌గా మార్చడంలో మనందరం భాగస్వాములవుదాం.. స్వచ్ఛహైదరాబాద్ సాధిద్దాం! ఒక్క ఫోన్‌కాల్‌తో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.