girl student missing
-
14 ఏళ్ల బాలిక కిడ్నాప్ డ్రామా.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ముంబై: చదువుకోమని తల్లి మందలించటంతో ఓ 14 ఏళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. నాగ్‌పూర్ నుంచి పక్క జిల్లా చంద్రాపూర్‌కు వెళ్లిన బాలిక తాను కిడ్నాప్‌కు గురయ్యానని ఓ కట్టుకథ అల్లింది. పోలీసులు గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టింది. కేసు వివరాలను ఆదివారం వెల్లడించారు పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగ్‌పూర్ జిల్లాలోని నందన్వన్ ప్రాంతానికి చెందిన బాలిక గత శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయింది. బస్సులో 150 కిలోమీటర్ల దూరంలోని చంద్రాపూర్‌కు సాయంత్రానికి చేరుకుంది. తమ కూతురు కనిపించకపోవటంతో ఆమె కోసం వెతకటం ప్రారంభించారు కుటుంబ సభ్యులు. ఆచూకీ లభించకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరోవైపు.. చంద్రాపూర్ చేరుకున్న బాలిక నేరుగా రామ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తనను ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసి కారులో చంద్రాపూర్‌కు తీసుకొచ్చినట్లు చెప్పింది. వారి నుంచి తప్పించుకుని వచ్చినట్లు కట్టుకథ అల్లింది. బాలిక తెలిపిన వివరాలతో నాగ్‌పూర్‌లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు చంద్రాపూర్ పోలీసులు. ఆ తర్వాత వారికి అప్పగించారు. నాగ్‌పూర్‌లోని నందన్వన్ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసింది. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. బాలిక తానే బస్సు ఎక్కి చంద్రాపూర్ వెళ్లినట్లు తేలింది. ఈ వీడియోను చూపించి ప్రశ్నించగా.. తన తల్లి చదువుకోవాలని మందలించటం వల్లే ఇలా చేశానని అంగీకరించింది. ఇదీ చదవండి: ‘సూపర్ హీరో’గా సిసోడియా.. కేజ్రీవాల్ ట్వీట్‌కు బీజేపీ కౌంటర్ -
శవమై తేలిన అదృశ్యమైన విద్యార్థిని
ఖమ్మం : జిల్లాలోని తిరుమలాయపాలెం ఎస్సీ బాలికల హాస్టల్లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే బానోత్ శిల్ప అనే విద్యార్థిని ఎస్సీ బాలికల హాస్టల్లో చదువుతోంది. గత కొద్దిరోజుల క్రితం శిల్ప హాస్టల్ నుంచి అదృశ్యమైంది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమె మృతదేహం హాస్టల్ లభ్యమైంది. దీంతో శిల్ప మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
9వ తరగతి విద్యార్థిని అదృశ్యం
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంద్రంలోని సాంఘిక సంసక్షేమ పాఠశాల వసతిగృహం నుంచి భవాని అనే 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైంది. రాజు అనే వ్యక్తిపై భవాని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజు, భవాని ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి వెళ్లిపోయివుంటారని భావిస్తున్నారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.