Glass industry
-
సీఎం జగన్‌ను కలిసిన త్రివేణి గ్లాస్ లిమిటెడ్ ఎండీ వరుణ్ గుప్తా
సాక్షి, తాడేపల్లి: త్రివేణి గ్లాస్ లిమిటెడ్ ఎండీ వరుణ్ గుప్తా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో సోమవారం కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై సీఎంతో చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వరుణ్ గుప్తాకు వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో రూ.1000 కోట్ల మూలధన పెట్టుబడితో రోజుకు 840 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన సోలార్ గ్లాస్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వరుణ్ గుప్తా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్లాంట్ వల్ల రెండు వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, ప్రభుత్వ సలహాదారు ఎస్.రాజీవ్ కృష్ణ పాల్గొన్నారు. -
మళ్లీ ఐపీవోల హల్చల్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఇటీవల దేశీయంగా ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. ఇటీవలే నిధుల సమీకరణ చేపట్టిన హర్ష ఇంజినీర్స్ నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో లిస్ట్‌కాగా.. ప్రభుత్వ రంగ కంపెనీ వ్యాప్కోస్ ఐపీవో బాట పట్టింది. మరోవైపు ఫ్లోట్ గ్యాస్ తయారీ కంపెనీ గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీ, ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ యూనిపార్ట్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూలకు తాజాగా సెబీ అనుమతించింది. వివరాలు చూద్దాం.. గోల్డ్ ప్లస్ గ్లాస్.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముసాయిదా పత్రాలు దాఖలు చేసిన గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. దీంతో ఐపీవోలో భాగంగా ఫ్లోట్ గ్లాస్ తయారీ కంపెనీ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.28 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులతోపాటు, సాధారణ కార్పొరేట్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. ఫ్లోట్ గ్లాస్ తయారీలో కంపెనీ దేశీయంగా 16 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఆటోమోటివ్, నిర్మాణం, పారిశ్రామిక రంగాలలో ప్రధానంగా కంపెనీ ప్రొడక్టులు వినియోగమవుతున్నాయి. యూనిపార్ట్స్ ఇండియా ఐపీవోకు వీలుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన యూనిపార్ట్స్ ఇండియాకు సెబీ ఓకే చెప్పింది. దీంతో ఇష్యూలో భాగంగా 1.57 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కాగా.. 2014 సెప్టెంబర్‌లో ఒకసారి, 2018 డిసెంబర్లో మరోసారి పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేసింది. ఈ రెండుసార్లూ సెబీ నుంచి అనుమతులు సైతం పొందింది. అయితే పరిస్థితులు అనుకూలించక వెనకడుగు వేసింది. కంపెనీ ప్రధానంగా ఆఫ్‌హైవే మార్కెట్‌కు అనుగుణమైన సిస్టమ్స్, విడిభాగాలను సరఫరా చేస్తోంది. వ్యవసాయం, కన్స్ట్రక్షన్, మైనింగ్ తదితర రంగాలకు సొల్యూషన్లు, ప్రొడక్టులు అందిస్తోంది. ఐపీవోకు వ్యాప్కోస్ నీటిపారుదల, విద్యుత్, మౌలిక సదుపాయాల రంగాలలో కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ సర్వీసులందించే పీఎస్‌యూ సంస్థ వ్యాప్కోస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి సిద్ధపడుతోంది. ఇందుకు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 3.25 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్(కేంద్ర ప్రభుత్వం) విక్రయానికి ఉంచనుంది. జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే కంపెనీ దక్షిణాసియా, ఆఫ్రికాలోనూ డ్యాములు, రిజర్వాయర్లకు సంబంధించిన ఇంజినీరింగ్, ఇరిగేషన్, వరద నియంత్రణ సర్వీసులను అందిస్తోంది. 30 దేశాలలో కార్యకలాపాలు విస్తరించింది. 455కుపైగా ప్రాజెక్టులు చేపట్టింది. గతేడాది(2021–22) ఆదాయం 11 శాతం బలపడి రూ. 2,798 కోట్లకు చేరగా.. నికర లాభం 14 శాతం పుంజుకుని రూ. 69 కోట్లను అధిగమించింది. కంపెనీ పనిచేస్తున్న విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఇతర సంస్థలలో ఇప్పటికే లిస్టయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైట్స్, ఇంజినీర్స్ ఇండియా, ఎన్బీ సీసీ, వా టెక్ వాబాగ్‌లను ప్రస్తావించవచ్చు. -
చెడు సావాసాలే ప్రాణం తీశాయి..
ఆళ్లగడ్డ:చెడు సావాసాలు చివరకు అతడి ప్రాణాన్నే బలిగొన్నాయి. వివరాల్లో కెళితే.. పట్టణంలోని పోస్టుమెన్దానం వీధికి చెందిన చెన్నయ్య, కళావతి కుమారుడు నేరెళ్ల చంద్రశేఖర్(39) 15 సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ ఈ మద్య సొంతంగా కూకట్పల్లి ప్రాంతంలో గ్లాస్‌వేర్ (గాజు గ్లాసుల తయారు) ఇండస్ట్రీని సొంతంగా ప్రారంభించి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పేరుకు ఆపనే అయినా అక్రమంగా మాదక ద్రవ్యాలను తయారు చేసేవాడని సమాచారం. ఇందుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో కొందరు డ్రగ్ మాఫియా సభ్యులతో పాటు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలించగా సుమారు రెండు నెలలు రిమాండ్‌లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో గత నెల 16న బ్యాంకు పనిమీద బయటకు వెళ్తున్నాని కుటుంబ సభ్యులకు తెలిపి వెళ్లిన చంద్రశేఖర్ తిరిగి రాలేదు. దీంతో అతడి భార్య శోభారాణి గత నెల 18న కూకట్పల్లి పోలీసులుకు ఫిర్యాదు చేసింది. కాల్ లిస్ట్ ఆధారంగా.. పోలీసులు బ్యాంకులోని సీసీ కెమరాలతో పాటు చంద్రశేఖర్ కాల్‌లిస్టును పరిశీలించగా చివరి కాల్ ఘట్కేసర్ అన్నాజిగూడాకు చెందిన మచ్చగిరి మాట్లాడినట్లు తేలింది. అప్పటికే అతను పరారయ్యాడు. మూడు రోజుల క్రితం మచ్చగిరి అన్నాజిగూడకు వచ్చినట్లు సమచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్యోదంతం బయటకు వచ్చింది. గ్లాస్ ఇండస్ట్రీ మాటున డ్రగ్స్ దందా.. ఇండోర్‌కు చెందిన బ్రిజ్‌భూషన్ పాండే, సంతోష్‌సింగ్‌లు ఏడాది క్రితం వరకు చర్లపల్లి పారిశ్రామికవాడలో గ్లాస్ ఇండస్ట్రీ మాటున అక్రమంగా డ్రగ్ దందా నిర్వహించేవారని తెలిసింది. అప్పుడు ఈ దందా వ్యవహారం పోలీసులకు తెలిసిందని అక్రమ వ్యాపారాన్ని నిలిపి వేసి ఇండర్ పారిపోయారు. ఇండోర్‌లోనే మాదకద్రవ్యాలను తయారు చేయడం మొదలు పెట్టారు. వీటి తయారికి అవసమైన ముడి పదార్థాలను హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ ద్వార తెప్పించుకునేవారు. అయితే చంద్రశేఖర్ మరో డ్రగ్ వ్యాపారి సోహైల్ తో చేతులుకలిపి పాండే, సంతోష్‌సింగ్‌లు జైలుకు వెళ్లేందుకు సహకరించాడు. జైలులో ఉన్న పాండే, సంతోష్సింగ్ల ను గుజరాత్ పోలీసులు వారంట్‌పై వాయిదాకు తీసుకెళ్తుండగా ఆగస్టు 17న తప్పించుకున్నారు. తాము జైలుకు వెళ్లెందుకు కారణం చంద్రశేఖరే అని బావించిన నిందితులు ఎలాగైనా చంద్రశేఖర్‌ను మట్టుబెట్టాలని బావించి గత నెల 16న హైదరబాద్ చేరుకుని తమకు మరో బాగస్వామి అయిన మచ్చగిరి తో చంద్రశేఖర్‌కు పోను చేయించి ప్రశాంత్‌నగర్‌కు రప్పించుకుని కిడ్నాప్ చేశారు. కొంపల్లి శివారులోకి తీసుకెల్లి కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. అక్కడి నుంచి మృతదేహాన్ని రింగ్‌రోడ్ వద్దకు తీసుకెళ్లి కొర్రేముల వద్ద గుంత తీసి పాతిపెట్టారు. మచ్చగిరిని సోమవారం సంఘటనా స్థలానికి తీసుకెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. మంగళవారం ఆళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం ఆళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య, కూతురు బ్లెన్సీ, కుమారుడు లక్కీ ఉన్నారు. -
మధ్యయుగంలోనే ‘గాజు పరిశ్రమ’
నల్లగొండ జిల్లాలో లభించిన చారిత్రక ఆధారాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : చారిత్రక ఆధారాలకు నెలవైన నల్లగొండ జిల్లాలో మరో కీలక చారిత్రక ఆధారం లభ్యమైంది. మధ్యయుగ కాలంలోనే (క్రీ.శ. 8-12 శతాబ్దాలు) ఇక్కడ గాజు పరిశ్రమ ఉందని చెప్పేందుకు అవసరమైన ఆనవాళ్లు లభించాయి. జిల్లాలోని కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో బుధవారం పురావస్తు శాఖ అధికారులు జరిపిన తవ్వకాల్లో మధ్య యుగం నాటి రంగు పెంకులు లభించాయి. పచ్చడి పెట్టుకునే జాడీల లోపలి భాగం మాదిరిగా నున్నగా ఉన్న ఈ రాళ్లు ఆనాడే జిల్లాలో గాజు పరిశ్రమ ఉందని చెప్పేందుకు ఆధారాలని పురావస్తు అధికారులు చెపుతున్నారు. ఈ తవ్వకాల్లోనే తొలియుగం నాటి (క్రీ.శ. 1-3 శతాబ్దాలు) జీవన ఆధారాలు, మధ్యయుగంలో నిర్మించిన ప్రాచీన శివాలయం కూడా లభించింది. ఈ శివాలయంలో సప్తఅశ్వ (ఏడు గుర్రాలు) రథాన్ని నడుపుతున్న సూర్య భగవానుడి విగ్రహం కూడా లభించడం విశేషం. ప్రాచీన శివాలయం కూడా..: కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో జరిపిన తవ్వకాల్లో ఎక్కువగా కుండపెంకులే లభించాయి. నల్లని, ఎర్రని, రెండు రంగులు కలిపి ఉన్న పెంకులు పురావస్తు అధికారులు సేకరించారు. వీటితోపాటు తొక్కుడు బిళ్లలు (హాప్స్కాచ్), టైట మట్టితో చేసిన అద్దకపు పనిముట్లు, సానరాళ్లు లభించాయి. ఇవి చారిత్రక యుగాల ఆనవాళ్లని పురావస్తు అధికారులు చెపుతున్నారు. అదే విధంగా మధ్యయుగ కాలానికి సంబంధించి నలుపు, ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న పెంకులు కూడా లభించాయి. ఈ పెంకులన్నీ చౌడుమట్టితో తయారుచేసినవి. వీటిని సానబట్టి (పాలిష్ చేసి) నున్నగా తయారు చేశారు. ఈ తవ్వకాల్లోనే మధ్యయుగ కాలంలో (కాకతీయుల సామ్రాజ్యంలో) నిర్మించిన ఓ ప్రాచీన శివాలయాన్ని కూడా పురావస్తు అధికారులు గుర్తించారు. ఈ ఆలయం నిర్మించిన సమయంలో ఈ ప్రాంతాన్ని కాకతీయుల సామంతులైన కందూరు చోళులు పాలించారని అంచనా.