మృతుడు నేరెళ్ల చంద్రశేఖర్
ఆళ్లగడ్డ:చెడు సావాసాలు చివరకు అతడి ప్రాణాన్నే బలిగొన్నాయి. వివరాల్లో కెళితే.. పట్టణంలోని పోస్టుమెన్‌దానం వీధికి చెందిన చెన్నయ్య, కళావతి కుమారుడు నేరెళ్ల చంద్రశేఖర్(39) 15 సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ ఈ మద్య సొంతంగా కూకట్‌పల్లి ప్రాంతంలో గ్లాస్‌వేర్ (గాజు గ్లాసుల తయారు) ఇండస్ట్రీని సొంతంగా ప్రారంభించి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పేరుకు ఆపనే అయినా అక్రమంగా మాదక ద్రవ్యాలను తయారు చేసేవాడని సమాచారం. ఇందుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో కొందరు డ్రగ్ మాఫియా సభ్యులతో పాటు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలించగా సుమారు రెండు నెలలు రిమాండ్‌లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో గత నెల 16న బ్యాంకు పనిమీద బయటకు వెళ్తున్నాని కుటుంబ సభ్యులకు తెలిపి వెళ్లిన చంద్రశేఖర్ తిరిగి రాలేదు. దీంతో అతడి భార్య శోభారాణి గత నెల 18న కూకట్‌పల్లి పోలీసులుకు ఫిర్యాదు చేసింది.
కాల్ లిస్ట్ ఆధారంగా..
పోలీసులు బ్యాంకులోని సీసీ కెమరాలతో పాటు చంద్రశేఖర్ కాల్‌లిస్టును పరిశీలించగా చివరి కాల్ ఘట్‌కేసర్ అన్నాజిగూడాకు చెందిన మచ్చగిరి మాట్లాడినట్లు తేలింది. అప్పటికే అతను పరారయ్యాడు. మూడు రోజుల క్రితం మచ్చగిరి అన్నాజిగూడకు వచ్చినట్లు సమచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్యోదంతం బయటకు వచ్చింది.
గ్లాస్ ఇండస్ట్రీ మాటున డ్రగ్స్ దందా..
ఇండోర్‌కు చెందిన బ్రిజ్‌భూషన్ పాండే, సంతోష్‌సింగ్‌లు ఏడాది క్రితం వరకు చర్లపల్లి పారిశ్రామికవాడలో గ్లాస్ ఇండస్ట్రీ మాటున అక్రమంగా డ్రగ్ దందా నిర్వహించేవారని తెలిసింది. అప్పుడు ఈ దందా వ్యవహారం పోలీసులకు తెలిసిందని అక్రమ వ్యాపారాన్ని నిలిపి వేసి ఇండర్ పారిపోయారు. ఇండోర్‌లోనే మాదకద్రవ్యాలను తయారు చేయడం మొదలు పెట్టారు. వీటి తయారికి అవసమైన ముడి పదార్థాలను హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ ద్వార తెప్పించుకునేవారు. అయితే చంద్రశేఖర్ మరో డ్రగ్ వ్యాపారి సోహైల్ తో చేతులుకలిపి పాండే, సంతోష్‌సింగ్‌లు జైలుకు వెళ్లేందుకు సహకరించాడు. జైలులో ఉన్న పాండే, సంతోష్‌సింగ్‌ల ను గుజరాత్ పోలీసులు వారంట్‌పై వాయిదాకు తీసుకెళ్తుండగా ఆగస్టు 17న తప్పించుకున్నారు.
తాము జైలుకు వెళ్లెందుకు కారణం చంద్రశేఖరే అని బావించిన నిందితులు ఎలాగైనా చంద్రశేఖర్‌ను మట్టుబెట్టాలని బావించి గత నెల 16న హైదరబాద్ చేరుకుని తమకు మరో బాగస్వామి అయిన మచ్చగిరి తో చంద్రశేఖర్‌కు పోను చేయించి ప్రశాంత్‌నగర్‌కు రప్పించుకుని కిడ్నాప్ చేశారు. కొంపల్లి శివారులోకి తీసుకెల్లి కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. అక్కడి నుంచి మృతదేహాన్ని రింగ్‌రోడ్ వద్దకు తీసుకెళ్లి కొర్రేముల వద్ద గుంత తీసి పాతిపెట్టారు. మచ్చగిరిని సోమవారం సంఘటనా స్థలానికి తీసుకెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. మంగళవారం ఆళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం ఆళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య, కూతురు బ్లెన్సీ, కుమారుడు లక్కీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment