అధ్యక్షుడిని చంపితే రూ. ఏడు కోట్లిస్తాం | new Philippines president Duterte after he offered to reward anyone who killed a drug dealer | Sakshi
Sakshi News home page

అధ్యక్షుడిని చంపితే రూ. ఏడు కోట్లిస్తాం

Published Fri, Jun 10 2016 2:43 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

అధ్యక్షుడిని చంపితే రూ. ఏడు కోట్లిస్తాం - Sakshi

అధ్యక్షుడిని చంపితే రూ. ఏడు కోట్లిస్తాం

ఫిలిప్పీన్స్ డ్రగ్స్ మాఫియా ఆఫర్లు
మనీలా: ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్ట్‌ను హత్య చేస్తే సుమారు రూ. 7.25 కోట్లు ఇస్తామంటూ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నేరస్తులు, డ్రగ్ డీలర్లపై యుద్ధం ప్రకటించడంతో డ్రగ్ మాఫియా ఈ రకమైన బెదిరింపులకు పాల్పడుతోంది. ఫిలిప్పీన్స్‌కు కొత్తగా ఎన్నికైన పోలీస్ చీఫ్ రొనాల్డ్ డెలా రోసా ఈ విషయం వెల్లడించారు. అధ్యక్షుడిని చంపితే మొదట్లో రూ.కోటిన్నర ఆఫర్ ప్రకటించింది.

అయితే ఈ పనికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ మొత్తాన్ని పెంచారట. తాను అధికార బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లో నేరా లు, డ్రగ్స్ మాఫియాను ఫిలిప్పీన్స్ నుంచి పరారయ్యేట్లు చేస్తానని డుటెర్ట్ ప్రకటిం చారు. డ్రగ్ డీలర్లను చంపిన వారికి నగదు బహుమతులు కూడా ఇస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement