చర్చిలో విదేశీయుల ప్రార్థనలు
ఇంగ్లాండ్‌లోని గ్లౌస్టర్ చర్చికి చెందిన పది మంది విదేశీయులు ఈనెల 6 నుంచి డోర్నకల్ అధ్యక్ష మండల పరిధిలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం వారు డోర్నకల్‌లోని ఎఫిఫనీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం చర్చి ప్రాంగణంలో మొక్కలు నాటి సందడి చేశారు. కార్యక్రమంలో డోర్నకల్ అధ్యక్ష మండల పీఠాధిపతి రెవ డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు, గ్లౌస్టర్ చర్చి ప్రతినిధులు డాక్టర్ మైక్ పర్సన్స్, డాక్టర్ రూత్ పర్సన్స్, షానన్ పాకర్తోపాటు మరో ఏడుగురు సభ్యులు పాల్గొన్నారు.
– డోర్నకల్