GNPA
-
మరింత తగ్గనున్న మొండిబాకీల భారం
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండిబాకీల భారం 2024 మార్చి నాటికి 5–5.5 శాతానికి దిగి వచ్చే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం 2022 మార్చి నాటికి స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్‌పీఏ) పరిమాణం ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.9 శాతానికి తగ్గింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో నెలకొన్న ఒత్తిడి క్రమంగా తగ్గి, మొండి బాకీల రికవరీలు కూడా పెరగనున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. అలాగే 2023 ఆర్థిక సంవత్సరంలో రుణ వ్యయాలు 1.5 శాతం స్థాయిలో స్థిరపడగలవని, అటుపైన 1.3 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. ఇతర వర్ధమాన మార్కెట్లు, భారత్ 15 ఏళ్ల సగటు స్థాయికి రుణ వ్యయాలు సర్దుబాటు కావొచ్చని తెలిపింది. వడ్డీ రేట్ల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణంతో చిన్న, మధ్య తరహా సంస్థలు, అల్పాదాయ కుటుంబాలపై పరిమిత స్థాయిలో ప్రతికూల ప్రభావం పడొచ్చని ఎస్అండ్పీ వివరించింది. మెరుగ్గా వృద్ధి అంచనాలు .. మధ్యకాలికంగా చూస్తే భారత్ ఆర్థిక వృద్ధి అవకాశాలు పటిష్టంగానే ఉండగలవని ఎస్అండ్పీ పేర్కొంది. 2024–26 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి వార్షికంగా 6.5–7 శాతం స్థాయిలో నమోదు కావచ్చని వివరించింది. జనాభా, చౌకగా కార్మిక శక్తి లభ్యత తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. అంతే గాకుండా ఆర్థిక వ్యవస్థకు కేంద్రం బాసటగా నిలుస్తుందని, అలాగే రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ యోచన ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మద్దతును కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఎస్అండ్పీ వివరించింది. రాబోయే రోజుల్లో జీడీపీకి అనుగుణంగా రుణ వృద్ధి ఉండగలదని, కార్పొరేట్ రంగంతో పోలిస్తే రిటైల్ రంగాలకు రుణాల్లో వృద్ధి అధికంగా ఉండే ధోరణులు కొనసాగవచ్చని పేర్కొంది. రుణ వ్యయాలు తగ్గడం, రుణ వృద్ధి మెరుగుపడుతుండటం వంటి అంశాలు బ్యాంకుల ఆదాయాలకు దన్నుగా నిలవొచ్చని ఎస్అండ్పీ వివరించింది. -
ఎన్పీఏలు ఇంకా పెరిగాయ్!
• క్యూ2లో మరో 80వేల కోట్లు అప్ • మొత్తం ప్రభుత్వ బ్యాంకుల • నిరర్ధక ఆస్తులు రూ.6.3 లక్షల కోట్లు న్యూఢిల్లీ: ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై - సెప్టెంబరు మధ్య) ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్థూల నిరర్ధక ఆస్తులు (జీఎన్‌పీఏ) ఏకంగా రూ.80 వేల కోట్ల మేర పెరిగారుు. జూన్ ఆఖరు నాటికి రూ.5,50,346 కోట్లుగా ఉన్న జీఎన్‌పీఏలు సెప్టెంబర్ 30 నాటికి రూ.6,30,323 కోట్లకు పెరిగారుు. త్రైమాసికాల వారీగా చూస్తే రూ.79,977 కోట్ల మేర పెరిగినట్లు రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఎన్పీఏలు అధికంగా ఉన్న రంగాల (ఇన్ఫ్రా, విద్యుత్, రహదారులు, టెక్స్టైల్స్, ఉక్కు మొదలైనవి) సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఆయన వివరించారు. కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ, రుణదాతల సంయుక్త ఫోరం, వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ పథకం మొదలైనవి ఇందులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఉక్కు రంగానికి ఇచ్చిన రూ.2.80 లక్షల కోట్ల రుణాల్లో సుమారు రూ. 1.24 లక్షల కోట్లు (దాదాపు 45 శాతం) మొండిబకారుులుగా మారాయని వివరించారు. ఏ కార్పొరేట్ రుణాన్నీ ప్రభుత్వం రద్దు చేయలేదన్నారు. సాంకేతిక రైటాఫ్‌లకు సంబంధించి బ్యాంకుల ప్రధాన కార్యాలయాల స్థారుులో రిజర్వ్ బ్యాంక్ అనుమతించినప్పటికీ.. శాఖల స్థారుులో ఆయా రుణాల రికవరీ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని గంగ్వార్ వివరించారు. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు రూ. 15,163కోట్ల రుణాలను రైటాఫ్ చేశారుు. గత ఆర్థిక సంవత్సరం ప్రైవేట్ రంగ బ్యాంకులు రూ. 12,017 కోట్లు, పీఎస్‌బీలు రూ. 59,547 కోట్లు రైటాఫ్ చేశారుు.