ఎన్పీఏలు ఇంకా పెరిగాయ్!
• క్యూ2లో మరో 80వేల కోట్లు అప్
• మొత్తం ప్రభుత్వ బ్యాంకుల
• నిరర్ధక ఆస్తులు రూ.6.3 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై - సెప్టెంబరు మధ్య) ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్థూల నిరర్ధక ఆస్తులు (జీఎన్‌పీఏ) ఏకంగా రూ.80 వేల కోట్ల మేర పెరిగారుు. జూన్ ఆఖరు నాటికి రూ.5,50,346 కోట్లుగా ఉన్న జీఎన్‌పీఏలు సెప్టెంబర్ 30 నాటికి రూ.6,30,323 కోట్లకు పెరిగారుు. త్రైమాసికాల వారీగా చూస్తే రూ.79,977 కోట్ల మేర పెరిగినట్లు రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఎన్‌పీఏలు అధికంగా ఉన్న రంగాల (ఇన్‌ఫ్రా, విద్యుత్, రహదారులు, టెక్స్‌టైల్స్, ఉక్కు మొదలైనవి) సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఆయన వివరించారు.
కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ, రుణదాతల సంయుక్త ఫోరం, వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకం మొదలైనవి ఇందులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఉక్కు రంగానికి ఇచ్చిన రూ.2.80 లక్షల కోట్ల రుణాల్లో సుమారు రూ. 1.24 లక్షల కోట్లు (దాదాపు 45 శాతం) మొండిబకారుులుగా మారాయని వివరించారు. ఏ కార్పొరేట్ రుణాన్నీ ప్రభుత్వం రద్దు చేయలేదన్నారు. సాంకేతిక రైటాఫ్‌లకు సంబంధించి బ్యాంకుల ప్రధాన కార్యాలయాల స్థారుులో రిజర్వ్ బ్యాంక్ అనుమతించినప్పటికీ.. శాఖల స్థారుులో ఆయా రుణాల రికవరీ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని గంగ్వార్ వివరించారు. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు రూ. 15,163కోట్ల రుణాలను రైటాఫ్ చేశారుు. గత ఆర్థిక సంవత్సరం ప్రైవేట్ రంగ బ్యాంకులు రూ. 12,017 కోట్లు, పీఎస్‌బీలు రూ. 59,547 కోట్లు రైటాఫ్ చేశారుు.