Goa DGP
-
గోవా డీజీపీ మరణం నన్ను కలచివేసింది
సాక్షి, అమరావతి: గోవా డీజీపీ ప్రణబ్‌నందా హటాన్మరణం నన్ను కలచి వేసిందని డీజీపీ గౌతం సవాంగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన గుండెపోటుతో చనిపోయారనే వాస్తవాన్ని నమ్మలేకపోయానన్నారు. నేను, ప్రణబ్‌నందా ఢిల్లీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నామని తెలిపారు. ఐపీఎస్‌గా ఆయన సేవలు మరువలేనివని, ఆయన లేని లోటు పోలీస్ శాఖలో తీర్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: ఢిల్లీ పర్యటనలో డీజీపీ ఆకస్మిక మృతి -
ఢిల్లీ పర్యటనలో డీజీపీ ఆకస్మిక మృతి
న్యూఢిల్లీ : గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) ప్రణబ్ నందా ఢిల్లీలో శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. అధికారిక పని మీద ఢిల్లీలో ఉన్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందినట్లు ఐజీ జస్పాల్ సింగ్ ప్రకటించారు. డీజీపీ నందా ఆకస్మిక మరణం తమకు షాక్ కలిగించిందని ఐజీ జస్పాల్ సింగ్ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవా డీజీపీగా నందా బాధ్యతలు చేపట్టారు. 1988లో ఐపీఎస్ అధికారిగా చేరిన ప్రణబ్ నందా అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ స్టేట్ క్యాడర్లలో పనిచేశారు. 2001లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధీనంలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో డెప్యుటేషన్ పై చేరి దేశ, విదేశాల్లో వీవీఐపీ సెక్యూరిటీ వ్యవహారాలు పర్యవేక్షించారు. కాబుల్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో భారత రాయబార కార్యాలయాల్లో భారతీయుల భద్రతాధికారిగా సేవలందించారు. ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, స్పెషల్ డ్యూటీ మెడల్ లభించాయి. ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదివి అనంతరం సోషియాలజీలో ఆయన మాస్టర్స్ డిగ్రీ చేశారు. ప్రణబ్ నందా భార్య సుందరి కూడా ఐపీఎస్ అధికారిణే. పుదుచ్చేరి డీజీపీగా ఆమె పని చేశారు. డీజీపీగా బాధ్యతలను స్వీకరించక ముందు దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆమె సేవలందించారు. -
'ఆ సినిమాను ప్రజలు బహిష్కరించాలి'
ఏ దిల్ హై ముష్కిల్ సినిమాను ఇంకా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. రిలీజ్‌కు ముందు పాకిస్థానీ నటుల కారణంగా బ్యాన్‌కు గురైన ఈ సినిమా మహారాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ తరువాత కూడా ఈ సినిమాను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా గోవా డీజీపీ ముఖేష్ చందర్ ఈ సినిమాను ప్రజలు బహిష్కరించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. వివాదాలతోనే భారీ ప్రచారం పొందిన ఏ దిల్ హై ముష్కిల్ ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కుంది. సినిమాలోని ఓ డైలాగ్ లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీని అవమానించేదిగా ఉందని, ఈ డైలాగ్ వల్ల సంగీతాభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న వాదన వినిపిస్తోంది. సినిమాను బహిష్కరించాలంటూ ఏకంగా డీజీపీ స్థాయి వ్యక్తి పిలుపునివ్వటంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. రణబీర్ కపూర్, అనుష్క శర్మతో చెప్పిన 'మహ్మద్ రఫీ..? ఓ గాతే కమ్, రోతే జ్యాదా తే నా..?' అనే డైలాగ్ వివాదానికి కారణం అయ్యింది. ప్రస్తుతం మంచి కలెక్షన్లతో సత్తాచాటుతున్న ఏ దిల్ హై ముష్కిల్ సినిమాకు ఈ వివాదం వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూడాలి.