బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
పశ్చిమగోదావరి: పాలకొల్లుకు చెందిన పోతురాజు చక్రవర్తి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతని మృతదేహం మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాలోని చించినాడలో గోదావరి బ్రిడ్జి వద్ద లభ్యమైంది.
రాజమండ్రి రైట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో పోతురాజు బీటెక్ చదువుతున్నాడు. తమ కుమారుడు మృతిచెందడంతో తీవ్ర ఆవేదనకు లోనైన తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.