'పుష్కరాలకు 18 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతి'
ఢిల్లీ: జులై 5 వరకు గోదావరి పుష్కరాల పనులు పూర్తవుతాయని ఏపీ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం లోపం లేదని, పుష్కరాలకు కేంద్ర మంత్రులను ఆహ్వానించేందుకే వచ్చానని చెప్పారు. పుష్కరాలకు రాజమండ్రికి 18 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ అనుమతి ఇచ్చిందని మాణిక్యాలరావు స్పష్టం చేశారు.