Godhra train accident
-
గోద్రా దోషికి బెయిల్
న్యూఢిల్లీ: 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో దోషి, యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఫరూఖ్‌కు సుప్రీంకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. అతడు గత 17 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాడని, అందుకే బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఫరూఖ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసులోని కొన్ని వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అతడి బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా స్టేషన్లో ఆగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై దుండుగులు నిప్పు పెట్టారు. ఎస్56 కోచ్ పూర్తిగా దహనమయ్యింది. అందులోని 59 మంది ప్రయాణికులు మరణించారు. రాళ్లు రువ్విన ఘటనలో ఫరూఖ్‌సహా కొందరు దోషులుగా తేలారు. -
ఎట్టకేలకు ‘గోద్రా’ నిందితుడు అరెస్ట్
14 ఏళ్ల అనంతరం మహ్మద్ భానా అదుపులోకి ♦ ముంబై నుంచి గోద్రా వెళ్తుండగా పట్టుకున్న గుజరాత్ పోలీసులు ♦ ఇన్నాళ్లూ ముంబైలో స్థిరాస్తి బ్రోకర్‌గా అవతారం ♦ గోద్రాకు రాకపోకలు ప్రారంభమవడంతో నిఘా పెంపు అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గోద్రా రైలు మారణహోమం ప్రధాన నిందితుడు ఫరూక్ మహ్మద్ భానాను గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఎట్టకేలకు బుధవారం అరెస్టు చేశారు. అతను 14 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. రహస్య సమాచారంపై స్పందిం చిన అధికారులు భానా ముంబై నుంచి గోద్రా వెళ్తుండగా కాలోల్లోని ఓ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నట్లు ఏటీఎస్ ఐజీ జేకే భట్ తెలిపారు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీలకు నిప్పు పెట్టడానికి భానా కుట్రపన్నాడని ఏటీఎస్ అధికారులు చెప్పారు. ఏటీఎస్ ప్రకారం.... ఘటన జరిగినప్పుడు భానా గోద్రాకు కార్పొరేటర్‌గా ఉన్నాడు. ఈ ప్రమాదానికి ప్రధాన కారకుడైన మౌలానా ఉమర్జీ సూచనల మేరకు భానా, మరో కార్పొరేటర్ బిలాల్ హజితో కలసి రైలుకు నిప్పంటిచాలని ఇతర నిందితులకు సమాచారం అందించాడు. గోద్రా ప్రమాదంలో 59 మంది కరసేవకులు మృతి చెందారు. తదనంతరం చెలరేగిన అల్లర్లలో సుమారు 1000 మంది చనిపోయారు. రెండు నెలల ముందే మొదలైన నిఘా గోద్రా ఘటన జరిగిన చాన్నాళ్ల తరువాత భానా గోద్రాకు రాకపోకలు సాగించడంతో రెండు నెలల నుంచి ఏటీఎస్ నిఘా పెంచింది. పదేళ్లుగా అతను ముంబైలోని అంధేరీ మురికి వాడలో నివసిస్తున్నాడు. ‘‘ఈ మధ్యకాలంలో భానా పాకిస్తాన్‌కు కూడా వెళ్లిన ట్లు తెలిసింది. షేక్ ఉమర్గా పేరు మార్చుకొని స్తిరాస్థి బ్రోకర్‌గా పనిచేశాడు. ఎవరూ గుర్తించకుండా ఉండడానికి గడ్డం పెంచాడు. 16ఏళ్లు గడిచాక సొంతూ రు రావడం క్షేమం అనుకొని ఉంటాడు’’ అని ఏటీఎస్ ఐజీ జేకే భట్ చెప్పారు. 16 ఏళ్ల కాలంలో ఈ కేసుకు సంబంధించి 94 మందిని అరెస్టు చేశారు. ప్రత్యేక కోర్టు 31 మందిని దోషులుగా తేల్చింది. -
సామాజిక చిత్రం
గోద్రా రైలు దుర్ఘటన జరిగి పదమూడేళ్లు. కానీ నాటి గాయాలు నేటికీ మానలేదు. ఇలాంటి సంఘటనలకు మూలం మత విద్వేషాలు. ఈ క్రమంలో మతసామరస్యంపై ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది బంజారాహిల్స్ లామకాన్‌లో శనివారం ప్రారంభమైన ‘కమ్యూనల్ హార్మోనీ ఫిల్మ్ ఫెస్టివల్’. విబ్జియార్ సహకారంతో విమోచన్, లామకాన్‌లు... గుజరాత్‌లోని గోద్రా అల్లర్లపై శుబ్రదీప్ చౌదరికి ట్రిబ్యూన్‌గా ఈ రెండు రోజుల ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశాయి. కార్యక్రమంలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ... మత విద్వేషాలకు కారణం కుల వ్యవస్థని, ఐదు వేల ఏళ్లుగా దళితులకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. దేశంలో నిమ్నకులస్థులు, ఆదివాసీలపై చిత్రాలు తీయాలన్నారు. తొలిరోజు ‘గోద్రా తక్, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ డాక్యుమెంటరీ చిత్రాలు ప్రదర్శించారు. గోద్రా రైల్వే స్టేషన్లో రైలు ఆగడం... క్షణాల్లో చెలరేగిన మంటలు... ఆ చిచ్చుకు శవాలుగా మారిన అమాయకులు... దేశాన్ని అట్టుడికించిన ఈ సంఘటన వాస్తవ రూపాన్ని పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు తేవాలన్న ఉద్దేశంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఈ పరిశోధనాత్మక డాక్యుమెంటరీ రూపొందించారు శుబ్రదీప్. ఈయన బ్రెయిన్ హ్యామరేజ్‌తో మరణించారు. ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్... అయోధ్య రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాల క్రమంలో రేగిన చిచ్చు, అల్లర్లపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. ఆనంద్ పట్వర్దన్ తీసిన ఈ డాక్యుమెంటరీ... అప్పటి రాజకీయ, సామాజిక, కులమత విద్వేషాలను కళ్లకు కట్టింది. ఈ ఆందోళనల వల్ల అగ్రకులాల వారు, రాజకీయ నాయకులు తప్ప మిగిలిన వారంతా నష్టపోతారని ఓ రైతు ముందే చెప్పడం గమనిస్తే... ఇందులో కుట్ర ఉందని అర్థం చేసుకున్నట్టేనన్నది దర్శకుడి అభిప్రాయం.