gold bhavita
-
పొద్దున్నే ఘోరం!
స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న లారీ చిన్నారులకు గాయాలు కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు తిరుచానూరు: విరిసీవిరియని ముద్దమందారాల్లాంటి చిన్నారులను నిద్ర లేపి, స్నానం చేయించి, మెరిసే యూనిఫాం వేసి, గో రు ముద్దలు తినిపించి, మధ్యాహ్నానికి క్యారేజీ ఇచ్చి, స్కూలు బ్యాగ్ చేత పట్టుకుని రోడ్డుదాకా వచ్చారు తల్లులు. స్కూ లు బస్సు రాగానే అందులోకి ఎక్కించి టాటా చెప్పారు. పాఠశాలలో చదువుకుంటున్న తమ చిన్నారుల బంగారు భ వితను తలచుకుంటూ ఇంటికొచ్చారు. ఇంట్లో అడుగు పెట్టీపెట్టకముందే టీవీ లో ‘స్కూలు వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముప్పై మందికి గాయాలు’ అంటూ స్క్రోలింగ్. దీనిని చూడగానే ఆ తల్లులు తల్లడిల్లిపోయారు. తమ బిడ్డలకేమైందో అంటూ ఆందోళన చెందారు. ఉరుకుల పరుగుల మీద యాక్సిడెంట్ జరిగిన స్థ లానికి చేరుకున్నారు. ఈ సంఘటన బు ధవారం తిరుచానూరు సమీపంలో జరి గింది. తిరుపతిలోని ఓ ప్రైవేటు స్కూలు వ్యాన్‌ను తీసుకుని డ్రైవర్ ఎప్పటిలానే బుధవారం ఉదయం వెళ్లాడు. తిరుచానూరు చుట్టు పక్కల గ్రామాల్లోంచి 30 మంది విద్యార్థులను వ్యాన్‌లో ఎక్కించుకున్నాడు. స్కూలుకు వచ్చే క్రమంలో తనపల్లి క్రాస్ వద్ద జాతీయరహదారి లోకి వచ్చాడు. వ్యాన్ డ్రైవర్ ఏమరుపా టో, అప్పుడే వచ్చిన లారీ డ్రైవర్ వేగ మో, విద్యార్థుల దురదృష్టమో తెలియదుగానీ.. వ్యాన్‌ను లారీ ఢీకొంది. దీంతో ఒక్కసారిగా విద్యార్థుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. స్థానికులు స్పం దించారు. వ్యాన్ కిటికీల్లోంచి చిన్నారుల ను వెలుపలకు తీశారు. 108లో రుయా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే టీవీల్లో ఈ విషయం స్క్రోలింగ్ రావడం మొదలైంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆం దోళనగా అక్కడకు చేరుకున్నారు. పిల్లలు ఆస్పత్రిలో ఉన్నారనగానే మరిం త కంగారు పడ్డారు. కన్నీరు మున్నీరవు తూ అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు గాయాలతో ఉన్న బిడ్డలను చూసి భోరుమన్నారు. వారిని చూడగానే చిన్నారు లూ పెద్దపెట్టున ఏడుపు మొదలు పె ట్టారు. వీరిని సముదాయించడం నర్సులకు తలకు మించిన భారంగా మారిం ది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరి తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యంపై ఆగ్రహం వ్య క్తం చేశారు. తాము తినీ తినకా, కూలీ నాలి చేసుకుంటూ కూడబెట్టుకున్న డ బ్బుతో పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపుతుంటే మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ నిలదీశారు. ఆస్పత్రి లో బిక్కచూపులు చూస్తున్న, ఏడుస్తున్న చిన్నారులు.. వారిని ఆ స్థితిలో చూడలేక తల్లడిల్లే తల్లిదండ్రులు.. ఈ దృశ్యం ప్ర తి ఒక్కరినీ కలచి వేసింది. విషయం తెలిసి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పిల్లలకు సరైన చికిత్స అందించాలని ఆస్పత్రి వర్గాలను ఆదేశిం చారు. అక్కడే ఉన్న పాఠశాల చైర్మన్‌తో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర మాదానికి కారణమైన వాహనాలు, డ్రైవర్లపైన కేసు నమోదు చేస్తామని తెలి పారు. -
కొలువు పారిశుధ్యం....టార్గెట్ ఖాకీ ఉద్యోగం
అందరిలాగే.. ఆమె కూడా తన బంగారు భవిత గురించి అందమైన కలలు కంది. ఉన్నత చదువులు చదివి పోలీస్ ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంది. కానీ, వాటిని సాకారం చేసుకోలేకపోరుుంది. పేదింటి తల్లిదండ్రులు ఆడకూతుర్ని పెళ్లిచేసి పంపటానికే ప్రాధాన్యతనిచ్చారు. అత్తింటి వారు మాత్రం ఆమె ఆసక్తిని అర్థం చేసుకుని అక్కున చేర్చుకున్నారు. చదువుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడామె పగలంతా పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తూనే.. రాత్రంతా చదువుకు కేటారుుస్తూ.. పోలీస్ ఉద్యోగమే లక్ష్యంగా పరుగులు తీస్తోంది. మర్రిపాలెం ఎస్టీ (యూనాదులు) కాలనీకి చెందిన ఇళ్ల ఈశ్వరీపాప నాగాయలంక గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతుండగానే.. పెళ్లి సంబంధం రావడంతో చదువుకు బ్రేక్ పడింది. తన స్వగ్రామం గుంటూరు జిల్లా రేపల్లె మండలం లక్ష్మీపురం నుంచి మర్రిపాలెం ఎస్టీ కాలనీలోని అత్తారింటికి చేరింది. అప్పటికే నాగాయలంక పంచాయతీలో పారిశుధ్య పనిచేస్తున్న ఆమె అత్త నాగేంద్రమ్మ గిరిజన నాయకురాలిగా ఉన్నారు. కోడలికి చదువుపై ఉన్న మమకారాన్ని గమనించిన ఆమె గ్రామ కార్యదర్శి శైలజాకుమారి ప్రోత్సాహంతో అవనిగడ్డ నవజీవన్ సంస్థ నిర్వహిస్తున్న ఓపెన్ స్కూలులో ఈశ్వరీపాపను చేర్పించింది. పగలంతా పారిశుధ్య పని, రాత్రంతా చదువుపై దృష్టిపెట్టిన ఈశ్వరి పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ప్రస్తుతం ఆమె ఓపెన్ యూనివర్సిటీలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. ప్రతి ఆదివారం పారిశుధ్య పనికి సెలవు పెట్టి తరగతులకు హాజరవుతోంది. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పారిశుధ్య పనిచేస్తోంది. ‘చదువు పూర్తిచేసి పోలీస్ కానీ, హోంగార్డు కానీ అవుతా. మా గిరిజనుల్లో చదువుపై ఆసక్తి కలిగిస్తా. భర్త శ్రీను, అత్త నాగేంద్రమ్మ, కార్యదర్శి శైలజాకుమారి ప్రోత్సాహంతోనే నేను చదువుకుంటున్నా.’ అని ఈశ్వరీపాప చెప్పింది. - నాగాయలంక -
కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవ సభ
రాజకీయ నేతల భాషాజాలంలో మార్పు రావాలి నిత్య విద్యార్థిగా ఉంటేనే బంగారు భవిత కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవ సభలో జస్టిస్ పీసీ రావు ఘనంగా వర్శిటీ రెండో స్నాతకోత్సవం సాక్షి, విజయవాడ : సమాజంలోని వాస్తవికతను గుర్తించి దానికి అనుగణంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అంతర్జాతీయ సముద్ర జల ట్రిబ్యునల్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ పత్తిబండ్ల చంద్రశేఖర్‌రావు (జర్మనీ) సూచించారు. నిరంతర అధ్యయనం, సునిశిత పరిశీలన, నిత్య విద్యార్థిగా ఉండటం ద్వారానే సమాజంలో విద్యార్థులు రాణించగలుగుతారన్నారు. శుక్రవారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణా యూనివర్శిటీ రెండో స్నాతకోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తొలుత విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో జన్మించిన తాను కృష్ణా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ అందుకోవటం ఆనందంగా ఉందన్నారు. డిగ్రీలు అందుకుని నూతన జీవితంలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు తమ సామాజిక బాధ్యతను విస్మరించకుండా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా అనేక చట్టాలు చేస్తున్నాయని, దీని ఆధారంగానే సామాజిక మార్పు వస్తుందని అందరు భావిస్తున్నారని చెప్పారు. కానీ, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించటంతోపాటు వాటిని అమలు చేస్తేనే కొంతైనా మార్పు వస్తుందన్నారు. అమలులో ఉన్న చట్టాల ప్రకారం ఎవరు పనిచేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోటారు వాహనాల చట్టాన్ని పాటిస్తే ట్రాఫిక్ జామ్‌తో పాటు ప్రమాదాలు తగ్గుతాయని హితవు పలికారు. తాను 1988 నుంచి 1996 వరకు ఆరుగురు ప్రధానమంత్రుల వద్ద పనిచేశానని, ఆ సమయంలో న్యాయశాస్త్ర అభ్యున్నతి కోసం ఎంతగానో శ్రమించానని చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాజకీయ నేతల భాషాజాలం సక్రమంగా లేదని, విమర్శలు చేసేందుకు ఉపయోగించే భాష అభ్యంతరకరంగా ఉందని, ఇది సమాజంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. న్యాయమూర్తుల నియామకాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు కొలిజియం జడ్జీలతో కమిటీ ఉందని, దీని స్థానంలో నేషనల్ జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనలు చట్టసభల ద్వారా వస్తున్నాయని చెప్పారు. వర్శిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పి.వెంకయ్య మాట్లాడుతూ ఆరేళ్ల కిందట ఆవిర్భవించిన కృష్ణా వర్శిటీ అంచెలంచెలుగా ముందుకు సాగుతోందని, రెండో స్నాతకోత్సవంలో 16వేల మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తున్నామని చెప్పారు. పీజీ, డిగ్రీ కోర్సులతోపాటు క్రీడలు, ఎన్ఎస్ఎస్, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నామని వర్శిటీ ప్రగతి నివేదిక వివరించారు. రుద్రవరంలో 71.75 కోట్లతో భవనాలు నిర్మించనున్నామని చెప్పారు. అనంతరం జస్టిస్ పీసీ రావును యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. స్నాతకోత్సవంలో కళాశాల విద్య రాష్ట్ర కమిషనర్ కె.సునీత, వర్శిటీ డీన్లు ప్రొఫెసర్ డి.సూర్యచంద్రరావు, ఎంవీ బసవేశ్వరరావు, వైకే సుందరకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంఏ తెలుగు విభాగంలో కొల్లూరి కల్పన, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మల్లాది దీప్తిలకు బంగారు పతకాలు బహూకరించారు.