పొద్దున్నే ఘోరం!
- స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న లారీ
- చిన్నారులకు గాయాలు
- కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
తిరుచానూరు: విరిసీవిరియని ముద్దమందారాల్లాంటి చిన్నారులను నిద్ర లేపి, స్నానం చేయించి, మెరిసే యూనిఫాం వేసి, గో రు ముద్దలు తినిపించి, మధ్యాహ్నానికి క్యారేజీ ఇచ్చి, స్కూలు బ్యాగ్ చేత పట్టుకుని రోడ్డుదాకా వచ్చారు తల్లులు. స్కూ లు బస్సు రాగానే అందులోకి ఎక్కించి టాటా చెప్పారు. పాఠశాలలో చదువుకుంటున్న తమ చిన్నారుల బంగారు భ వితను తలచుకుంటూ ఇంటికొచ్చారు. ఇంట్లో అడుగు పెట్టీపెట్టకముందే టీవీ లో ‘స్కూలు వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముప్పై మందికి గాయాలు’ అంటూ స్క్రోలింగ్. దీనిని చూడగానే ఆ తల్లులు తల్లడిల్లిపోయారు. తమ బిడ్డలకేమైందో అంటూ ఆందోళన చెందారు. ఉరుకుల పరుగుల మీద యాక్సిడెంట్ జరిగిన స్థ లానికి చేరుకున్నారు. ఈ సంఘటన బు ధవారం తిరుచానూరు సమీపంలో జరి గింది.
తిరుపతిలోని ఓ ప్రైవేటు స్కూలు వ్యాన్‌ను తీసుకుని డ్రైవర్ ఎప్పటిలానే బుధవారం ఉదయం వెళ్లాడు. తిరుచానూరు చుట్టు పక్కల గ్రామాల్లోంచి 30 మంది విద్యార్థులను వ్యాన్‌లో ఎక్కించుకున్నాడు. స్కూలుకు వచ్చే క్రమంలో తనపల్లి క్రాస్ వద్ద జాతీయరహదారి లోకి వచ్చాడు. వ్యాన్ డ్రైవర్ ఏమరుపా టో, అప్పుడే వచ్చిన లారీ డ్రైవర్ వేగ మో, విద్యార్థుల దురదృష్టమో తెలియదుగానీ.. వ్యాన్‌ను లారీ ఢీకొంది. దీంతో ఒక్కసారిగా విద్యార్థుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. స్థానికులు స్పం దించారు. వ్యాన్ కిటికీల్లోంచి చిన్నారుల ను వెలుపలకు తీశారు.
108లో రుయా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే టీవీల్లో ఈ విషయం స్క్రోలింగ్ రావడం మొదలైంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆం దోళనగా అక్కడకు చేరుకున్నారు. పిల్లలు ఆస్పత్రిలో ఉన్నారనగానే మరిం త కంగారు పడ్డారు. కన్నీరు మున్నీరవు తూ అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు గాయాలతో ఉన్న బిడ్డలను చూసి భోరుమన్నారు. వారిని చూడగానే చిన్నారు లూ పెద్దపెట్టున ఏడుపు మొదలు పె ట్టారు. వీరిని సముదాయించడం నర్సులకు తలకు మించిన భారంగా మారిం ది.
ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరి తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యంపై ఆగ్రహం వ్య క్తం చేశారు. తాము తినీ తినకా, కూలీ నాలి చేసుకుంటూ కూడబెట్టుకున్న డ బ్బుతో పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపుతుంటే మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ నిలదీశారు. ఆస్పత్రి లో బిక్కచూపులు చూస్తున్న, ఏడుస్తున్న చిన్నారులు.. వారిని ఆ స్థితిలో చూడలేక తల్లడిల్లే తల్లిదండ్రులు.. ఈ దృశ్యం ప్ర తి ఒక్కరినీ కలచి వేసింది.
విషయం తెలిసి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పిల్లలకు సరైన చికిత్స అందించాలని ఆస్పత్రి వర్గాలను ఆదేశిం చారు. అక్కడే ఉన్న పాఠశాల చైర్మన్‌తో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర మాదానికి కారణమైన వాహనాలు, డ్రైవర్లపైన కేసు నమోదు చేస్తామని తెలి పారు.