తనిఖీల్లో నగదు పట్టివేత
రెబ్బెన, న్యూస్‌లైన్ : మండలంలోని గోలేటి ఎక్స్‌రోడ్డు వద్ద మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు బెల్లంపల్లి నుంచి ఆసిఫాబాద్‌కు కారులో తరలిస్తున్న రూ.33లక్షల నగదు పట్టుకున్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించి తహశీల్దార్ జగదీశ్వరి సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం బెల్లంపల్లి డీఎస్పీ ఈశ్వర్రావు వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లికి చెందిన ఓ పెట్రోల్ బంక్ యజమాని రూ.33లక్షల నగదు కారులో ఆసిఫాబాద్‌కు తరలిస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో పత్రాలు లేకపోవడంతో ఐటీ అధికారులకు అప్పగించన్నుట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ తహశీల్దార్ రాంమోహన్‌రావు, తాండూర్ సీఐ ఎండీ సర్వర్, రెబ్బెన ఎస్సై శ్రీనివాస్, ఆర్ఐ బక్కయ్య పాల్గొన్నారు.
గూడెం చెక్‌పోస్టు వద్ద..
దండేపల్లి : మండలంలోని గూడెం అటవీ చెక్‌పోస్టు వద్ద సోమవారం రాత్రి ఎన్నికల అధికారి రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. రామకృష్ణాపూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి మారుతీకారు తనిఖీ చేయగా రూ.60వేల నగదు లభించింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో దండేపల్లి ఎస్సై మోహన్‌బాబుకు అప్పగించారు. నగదును మంగళవారం కోర్టులో స్వాధీనం చేశారు.
కాగజ్‌నగర్‌లో..
కాగజ్‌నగర్ : ఆసిఫాబాద్ నుంచి సిర్పూర్(టి) వైపు వెళ్తున్న ఎండీ.తాజుద్దీన్ వద్ద రూ.లక్షా 6వేలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పట్టణంలోని అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఆసిఫాబాద్‌కు చెందిన తాజుద్దీన్ ఎలాంటి ఆధారాలు లేకుడా ద్విచక్ర వాహనంపై నగదు తరలిస్తుండగా పట్టుకున్నారు. సిర్పూర్(టి) మండలం హీరాపూర్‌లో పత్తి కొనుగోలు చేశానని, దానికి సంబంధించిన డబ్బులను చెల్లించేందుకు వెళ్తున్నానని చెప్పినా ఆధారాలు లేకపోవడంతో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.