Golf game
-
నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ విజేత దబాంగ్ డేర్ డెవిల్స్
నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ టైటిల్‌ను లక్నోకు చెందిన దబాంగ్ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లోని కంట్రీ క్లబ్ వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో దబాంగ్ డేర్ డెవిల్స్ 3-2 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ మైసాపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో గోల్ఫర్స్ గిల్డ్ 3-2 తేడాతో నానో ఫ్లిక్స్ టీమ్‌ను ఓడించింది. ఈ టోర్నీ ముగింపు కార్యక్రమానికి టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్, అతర్జాతీయ గోల్ఫ్ ప్లేయర్స్ టీసా మాలిక్ , ప్రితిమా దిలావరి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సీజన్ ఛాంపియన్‌గా నిలిచిన దబాంగ్ డేర్ డెవిల్స్ టీమ్‌కు రూ. 5 లక్షల ఫ్రైజ్‌మనీ దక్కగా.. రన్నరప్ టీమ్ మైసాకు రూ.3 లక్షలు, మూడో స్థానంలోనిలిచిన గోల్ఫర్స్ గిల్డ్ జట్టుకు రూ.2 లక్షల నగదు బహుమతి వరించింది. -
బధిరుల ఒలింపిక్స్ గోల్ఫ్ ఫైనల్లో దీక్ష
బ్రెజిల్లో జరుగుతున్న బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో భారత మహిళా గోల్ఫర్ దీక్ష డాగర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గత క్రీడల్లో (2017)లో రజతం గెలిచిన ఆమె ఈ సారి స్వర్ణ పతకంపై గురి పెట్టింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల దీక్ష... అండ్రియా హోవ్‌స్టెయిన్ (నార్వే)పై విజయం సాధించింది. గురువారం జరిగే ఫైనల్లో భారత గోల్ఫర్ అమెరికాకు చెందిన యాష్లిన్ గ్రేస్ జాన్సన్‌తో తలపడుతుంది. -
కోట్ల మందికి గోల్ఫ్ మజా.. టాప్ ప్లేయర్లకు ముచ్చెమటలు
-
కాళ్లకు రంగు షూలు.. తలకు పచ్చటోపీ; నీ వేషదారణ చూడలేకపోతున్నాం
లండన్: టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెటర్లు వినోదంలో మునిగి తేలుతున్నారు. తాజాగా ఇషాంత్ శర్మ గోల్ఫ్ ఆడడంపై యువీ తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. అయితే యువీ ట్రోల్ చేసింది లంబూ ఆటను అనుకుంటే పొరపాటే... అతను ట్రోల్ చేసింది ఇషాంత్ వేషదారణను. కాళ్లకు రంగు షూలతో.. తలకు పచ్చ టోపీతో కాస్త వింతగా కనిపించిన ఇషాంత్‌ను ' లంబూ జీ నీ వేషదారణతో మేము చచ్చిపోయేలా ఉన్నాం.. కాస్త ఆ గెటప్‌ను మార్చు' అంటూ ట్రోల్ చేశాడు. కాగా ఇటీవలే కివీస్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన ఇషాంత్ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో కివీస్ చేతిలో పరాజయం పాలైంది. అయితే ఈ ఓటమిని మరిచిపోయి టీమిండియా నూతనోత్సాహంతో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతుంది. కాగా ఇషాంత్ శర్మ కొన్నాళ్లనుంచి కేవలం టెస్టు ఫార్మాట్‌కు పరిమితమయ్యాడు. ఇటీవలే టీమిండియా తరపున 100 టెస్టు మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న ఆటగాడిగా ఇషాంత్ నిలిచాడు. ఓవరాల్‌గా ఇషాంత్ శర్మ 102 టెస్టుల్లో 306 వికెట్లు పడగొట్టాడు. ఇక 80 వన్డేల్లో 115 వికెట్లు, 14 టీ20ల్లో 8 వికెట్లు తీసుకున్నాడు. View this post on Instagram A post shared by Ishant Sharma (@ishant.sharma29) -
జీవితం ఆట లాంటిది.. ఎవరి ఆట వారిదే: రకుల్
‘‘జీవితం ఒక ఆట లాంటిది. ఎవరి ఆట వారిదే. ఒకరి ఆటను ఇంకొకరు ఆడలేం. కష్టమైన ఆటలు ఉంటాయి. ఆనందాన్నిచ్చేవీ ఉంటాయి’’ అంటున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. జీవితాన్ని గోల్ఫ్ ఆటతో పోల్చారామె. ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ – ‘‘ఏ ఆటలో అయినా ప్రత్యర్థి ఉంటారు. కానీ గోల్ఫ్‌కు ఉండరు. మనం బంతిని ఎంత వేగంగా కొడుతున్నామనే దాని మీదే మన విజయం ఆధారపడి ఉంటుంది. సొంతంగా ఆడాలి. మన జీవితం మన సొంత ఆట లాంటిది. గోల్ఫ్ ఆటలో బంతిని కొట్టేటప్పుడు తలదించుకోవాలి. తల ఎత్తితే షాట్ మిస్సవుతుంది. జీవితంలో మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం మంచిదని ఆ విధంగా గోల్ప్ ఆట నాకు చెప్పింది. అలాగే ఒకసారి షాట్ మిస్సయిందంటే మళ్లీ మళ్లీ ప్రయత్నించాలని, విజయం ఖాయం అనే నమ్మకం కలుగుతుంది. జీవితం మీద నమ్మకాన్ని కోల్పోకూడదని గోల్ఫ్ చెబుతుంది. ఎందుకంటే అద్భుతాలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంటుంది’’ అన్నారు. నిజానికి ఐదో క్లాస్‌లో ఉన్నప్పుడు రకుల్ తండ్రి ఆమెను గోల్ఫ్ నేర్పించడానికి తీసుకెళితే, నచ్చేది కాదట. ‘‘మా నాన్నగారు ఆర్మీకి చెందిన వ్యక్తి. సహజంగానే స్పోర్ట్స్‌తో అనుబంధం ఉంటుంది. అందుకే ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ వంటివన్నీ కోచ్‌లను పెట్టి నేర్పించారు. అలాగే గోల్ఫ్ కూడా. నాకేమో అది ప్రాచీన ఆటలా అనిపించేది. ఇష్టం ఉండేది కాదు. కానీ నేర్చుకోవడం మొదలుపెట్టాక ఇష్టం పెరిగింది. ప్రతి ఒక్కరూ ఏదొక ఆట నేర్చుకోవాలి. అది మనం సంయమనంతో ఉండడానికి ఉపయోగపడుతుంది’’ అన్నారు రకుల్ ప్రీత్‌సింగ్. చదవండి: (బ్రదర్.. ఆ క్షణాలు ఎప్పుడూ సంతోషకరమైనవే: ఎన్టీఆర్) -
గోల్ఫ్ 24/7
గోల్ఫ్ అంటే పిచ్చి ప్రేమ ఉన్నవారి కోసమే ఇది. రాత్రి సమయంలో కూడా గోల్ఫ్ ఆడేయాలన్న ఆసక్తి ఉన్నవారి కోసం అమెరికాకు చెందిన నైట్ స్పోర్ట్స్ యూఎస్ఏ కంపెనీ వెలుగులు చిమ్మే గోల్ఫ్ బాల్‌ను తయారుచేసింది. ఇందులో ఎల్ఈడీలు ఉంటాయి. గోల్ఫర్ షాట్ కొట్టగానే ఇది వెలుగుతుంది. ఒక్క బాలే కాదు.. వెలిగే మార్కర్లు, ఫ్లాగ్స్, చిన్నపాటి చెట్లు ఇలా అన్నిటినీ ఈ కంపెనీ రూపొందించింది. నాలుగు బాల్స్ ఉన్న ప్యాక్ ధర రూ.1,800.