నిలిచిపోయిన గోల్కొండ ఎక్స్ప్రెస్
వరంగల్: సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళుతోన్న గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం సాయంత్రం జనగామా స్టేషన్లో నిలిచిపోయింది.
సాంకేతిక కారణాలవల్లే రైలు నిలిచిపోయినట్లు తెలిసింది. ఒకవైపు రైలు ఆగిపోవడం, మరో వైపు వర్షం కురుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థపడ్డారు.