Golly soda
-
బిర్యానీ తిన్నామంటే గోలీ సోడా పడాల్సిందే..
హే బాబూ.. ఓ గోలీ సోడా కొట్టవోయ్.. ఈ మాట విని ఎన్నేళ్లవుతుందో కదా..! ఒకప్పుడు ప్రతి ఊర్లో.. ప్రతి వీధిలో బండిపై గోలీ సోడా అమ్ముతుండేవారు. ఎండాకాలం వచి్చందంటే చాలు అలా గోలీ సోడా ఒకటి కడుపులో పడిందంటే ఎంతో హాయిగా ఉండేది. కాలక్రమేణా గోలీ సోడా స్థానంలోకి శీతల పానీయాలు వచ్చి చేరాయి. మళ్లీ ఇప్పుడు పాత రోజులు గుర్తు చేసేందుకు గోలీ సోడాలు మార్కెట్లోకి వచ్చేశాయి. అప్పట్లో వీటి టేస్ట్ చూసిన వారు.. ఆ టేస్ట్ తెలుసుకొని నేటి యువత వాహ్.. అంటున్నారు. గోలీ సోడా తాగితే చాలు ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు హైదరాబాద్ యువత. నగరంలో గోలీ సోడాకు పెరుగుతున్న క్రేజ్డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో కలర్ఫుల్గా ..సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న యూత్ ఒకప్పుడు తోపుడు బండ్లపై నిమ్మకాయ సోడా, సాదా సోడాలు అమ్ముతుండే వారు. ఇప్పుడు మాత్రం డిఫరెంట్ ఫ్లేవర్లలో అందుబాటులోకి వచ్చాయి. అలా హైదరాబాదీ బిర్యానీ తిన్నామంటే.. ఓ గోలీ సోడా పడాల్సిందే.. అన్నట్టు ట్రెండ్ సెట్ చేస్తున్నారు సిటీ యూత్. డిఫరెంట్ ఫ్లేవర్స్తోనే కాకుండా క్రేజీ కలర్స్‌లో దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద మాల్స్, రెస్టారెంట్లలో గోలీసోడాల సీసాలను ఇప్పుడు అమ్ముతున్నారు. బ్లూబెర్రీ, వర్జిన్ మొజిటో, లెమనేడ్, నింబూమసాలా, యాపిల్ మొజిటో, ఆరెంజ్, రోజ్‌ఎసెన్స్ ఇలా వేర్వేరు ఫ్లేవర్స్‌లో కంపెనీలు తయారు చేస్తున్నాయి. లెమన్ ట్రీ, పర్పుల్ హేజ్, బెడ్ ఆఫ్ రోజెస్ం అంటూ పాపులర్ ఇంగ్లిష్ పాటల పేర్లు పెట్టి మరీ యువతను ఆకర్షిస్తున్నారు. దుకాణాలతో పాటు కొన్ని హోటళ్లూ, క్లబ్బులూ కాలేజీలకు కూడా ఈ సోడాలను సరఫరా చేస్తున్నారు. దాంతో అందరి దృష్టి మళ్లీ.. సోడావైపు మళ్లింది.ఆ టేస్టే వేరు.. గోలీ సోడా సీసా స్టైల్, కలర్, గోలీ కొడుతుంటే వచ్చే శబ్దం.. అందులోని సోడా అన్నీ ప్రత్యేకమే.. చిన్నప్పుడు ఊర్లలో ఒకటి, రెండు రూపాయలకు దొరికే సోడా తాగేందుకు ఎంతో ఎదురు చూసేవాళ్లం. సోడా తాగిన తర్వాత వచ్చే అనుభూతి వేరేలా ఉండేది. ఇప్పుడు కూడా ఎక్కడైనా సోడా బాటిల్ కని్పస్తే వేరే కూల్‌డ్రింక్స్ ఉన్నా కూడా గోలీ సోడా తాగుతుంటే వచ్చే మజానే వేరు. – సాయికిరణ్ మెగావత్, హిమాయత్నగర్ఆ శబ్దం వింటే.. అదో ఆనందం..పిల్లలకు గోలీ సోడా సరదా ఓ పట్టాన తీరేది కాదు. రబ్బరు కార్కుతో సోడా కొట్టగానే గోలీ లోపలికి వెళ్లినప్పుడు వచ్చే ఆ శబ్దానికి కళ్లనిండా ఆశ్చర్యమే. ఆ శబ్దం వింటే మనసుకు అదో తృప్తి. గోలీసోడాలో ఉండేది కార్బొనేటెడ్ నీళ్లే. మొదటగా 1767లో జోసెఫ్ ప్రిస్ట్లే అనే శాస్త్రవేత్త, కార్బన్‌డయాక్సైడ్‌ను నీటిలోకి పంపి, స్నేహితులకిస్తే, ఆ రుచి నచ్చడంతో అందులో పండ్ల ఫ్లేవర్లూ, చక్కెరలూ కలిపి సాఫ్ట్‌డ్రింక్స్ తయారు చేయడం ప్రారంభించారు. అందుకే సోడా కూడా ఓ సాఫ్ట్ డ్రింకే.. మొదట్లో సోడా నీళ్లని సాదా బాటిల్స్‌లోనే నింపేవారు. అయితే మూత బిగించేటప్పుడూ తీసేటప్పుడూ గ్యాస్ పోయేది. అలా వెళ్లిపోకుండా ఉండేందుకు ఇప్పుడు మనం చూస్తున్న కాడ్నెక్ బాటిల్‌ను రూపొందించారు. 1872లో హిరమ్ కాడ్ అనే బ్రిటిష్ ఇంజినీర్ దీన్ని తయారు చేశాడు. ఈ బాటిల్ మందంగా ఉంటుంది. -
బ్రాండ్ కోనసీమ ఓ సోడా కొట్టవోయ్..
సాక్షి, అమలాపురం: ఓ సోడా కొట్టవోయ్.. ఒకప్పుడు పల్లెలు, పట్టణాల్లో ఎక్కువగా వినిపించే మాట ఇది. పొలాల నుంచి అలసిసొలసి వచ్చిన రైతులు, కూలీలు, వాహనాలపై దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణీకులకు దప్పిక తీర్చేది గోలీ సోడానే. గోలీ సోడా.. సోడా బుడ్డి.. గ్యాస్ సోడా.. ఇలా పేరేదైనా ఒకప్పుడు సామాన్యుడి దప్పిక తీర్చే పానీయం ఇది. గోలీ సీసాలో గ్యాస్‌తో కలగలిసిన నీళ్లు (కార్బొనేటెడ్ వాటర్) గొంతులోకి దిగుతూంటే కలిగే అనుభూతే వేరు. అందుకే గోలీ సోడా గమ్మత్తయిన ఎవర్గ్రీన్ పానీయం. సాఫ్ట్ డ్రింకులు వచ్చిన తరువాత వీటికి డిమాండ్ తగ్గింది. పాన్ షాపుల్లో కొంత మంది మాత్రమే సోడాలు విక్రయించేవారు. కాలం మారింది. సోడాకు పూర్వ వైభవం వచ్చింది. థమ్సప్, పెప్సీ తరహాలో గోలీ సోడా కూడా కార్పొరేట్ హంగులు అద్దుకుంది. కొత్త రుచులతో పల్లెల్లో ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకుంటోంది. పళని స్వామి.. పద్దెనిమిది రకాల సోడాలు అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన వర్రే రామకృష్ణ ‘పళని స్వామి గోలీ సోడా’ పేరుతో పాన్‌షాప్ నడుపుతున్నారు. గతంలో తమిళనాడు ప్రాంతంలో కొబ్బరి కారి్మకునిగా పని చేసిన ఆయన కరోనా సమయంలో స్వగ్రామానికి తిరిగి వచ్చారు. అంబాజీపేటలోని పి.గన్నవరం మెయిన్ రోడ్డును ఆనుకుని పాన్‌షాప్ ఆరంభించారు. తొలినాళ్లలో సాదా రకం, నిమ్మ సోడాలు మాత్రమే అమ్మేవారు. క్రమంగా సోడాను సరికొత్త రుచులతో అందించాలని నిర్ణయించారు. నీళ్ల సోడా, నిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్, లెమన్, పైనాపిల్, సుగంధి, సిట్రా, వామ్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, మ్యాంగో, రోజ్, వాటర్ మిలన్, వెనిల్లా, కాలాకట్టా, గ్రీన్ ఆపిల్, నేరేడు రకాల ఫ్లేవర్లతో సోడాలు విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో 700 వరకూ సోడాలు అమ్మే రామకృష్ణ వేసవిలో 1,200 పైగా విక్రయిస్తారు. ‘ఒకదాని తరువాత ఒకటి కొత్త రుచితో సోడాలు తయారు చేసి అమ్మడం మొదలు పెట్టాను. ఇప్పుడమ్ముతున్న దాని కన్నా ఇంకా ఎక్కువ సోడాలు అమ్మే అవకాశముంది. కానీ కూలింగ్ సరిపోవడం లేదు. పూర్తి స్థాయి కూలింగ్ లేకపోతే సోడా రుచి ఉండదు’ అని రామకృష్ణ చెప్పారు. తోపుడు బండిపై.. 52 ఏళ్లుగా.. అంబాజీపేట మండలం కె.పెదపూడికి చెందిన దాçసరి సత్యనారాయణ 52 ఏళ్లుగా తోపుడు బండిపై గోళీ సోడాలు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు వయస్సు 68 ఏళ్లు. కె.పెదపూడి, పుల్లేటికుర్రు, ఇరుసుమండ, ముక్కామల, వ్యాఘ్రేశ్వరం గ్రామాల్లో రో డ్ల మీద బండి తోసుకుంటూ వెళ్లి ఆయన సోడాలు విక్రయించేవా రు. తొలి రోజుల్లో ఒక్కో సోడా పది పైసలకు అమ్మేవారు. ఇప్పు డు సాదా రూ.5, నిమ్మ సోడా రూ.8కి అమ్ముతున్నా రు. ‘నేను సోడాలు అమ్మే గ్రామాల్లో సోడా బడ్డీలు న్నా నా దగ్గరే తాగేవారు. గతంలో రోజుకు ఎనిమిదిసార్లు తోపుడు బండి నింపి 560 వరకూ సోడాల అమ్మకాలు చేసిన రోజులు న్నాయి. వయస్సు పెరగడంతో ఇప్పుడు ఎక్కువ దూరం వెళ్లలేకపోతున్నాను’ అని సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. తోపుడు బండిపై సోడాలు విక్రయిస్తున్న సత్యనారాయణ 66 ఏళ్లుగా సిట్రా షోడా పి.గన్నవరం మండలం నాగుల్లంక పేరు చెప్పగానే చాలా మందికి సిట్రా సోడా గుర్తుకు వస్తుంది. పి.గన్నవరం – రాజోలు ప్రధాన రోడ్డును ఆనుకుని నాగుల్లంకలో ఉన్న దుర్గా కూల్‌డ్రింక్స్ అండ్ పాన్ షాపులో సిట్రా సోడాకు మంచి డిమాండ్ ఉంది. ఈ సోడాను కంకటాల నెరేళ్లు 1957లో ప్రారంభించారు. అప్పటి నుంచి అంటే.. సుమారు 66 ఏళ్లుగా వారు సిట్రా సోడాలు అమ్ముతున్నారు. తొలుత వీరు గోలీ సీసాల్లో సిట్రా షోడాలు విక్రయించగా, ఇప్పుడు మెషీన్‌తో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షాపును నెరేళ్లు కుమారులు శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, ఈశ్వరరావు, సత్యనారాయణ నిర్వహిస్తున్నారు. ‘సోడా అమ్మకాల విధానంలో మార్పు వచ్చినా.. ఫార్ములా పాతదే. రుచి కూడా అదే. అందుకే ఇన్నాళ్లయినా మా వద్ద డిమాండ్ తగ్గలేదు’ అని ఈశ్వరరావు చెప్పారు. కార్పొరేట్ గోలీ సోడా శీతల పానీయాలనే కాదు.. గోలీ సోడాలను సైతం కొత్త రుచులతో మార్కెట్ చేస్తూండటం కార్పొరేట్ సంస్థలకు ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది. పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులు ఇప్పుడు గోలీ సోడా అమ్మకాలు చేపడుతున్నారు. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా ఈ కార్పొరేట్ గోలీ సోడాలు పల్లెలకు సైతం వస్తున్నాయి. రకరకాల ఫ్లేవర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. -
120 రోజుల్లో 108 చిత్రాలు
తమిళ చిత్రసీమలో మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అధిక సంఖ్యలో చిత్రాలు విడుదలవుతున్నాయి. వారానికి కనీసం ఐదు చిత్రాల నుంచి 10 చిత్రాల వరకు విడుదలవుతున్నాయి. ఏప్రిల్ చివరి వరకు మొదటి నాలుగు నెలల్లో ఇప్పటి వరకు 108 చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో స్ట్రైయిట్ తమిళ చిత్రాలు సుమారు 80 ఉన్నాయి. అయితే, వీటన్నింటిలో ‘గోలీ సోడా’ మాత్రమే అత్యధిక వసూళ్లతో విజయవంతమైంది. ప్రముఖ నటులు నటించిన కొన్ని చిత్రాలు వసూళ్లు సాధించినా వాటి బడ్జెట్‌ను పోల్చి చూసినట్లయితే నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యజమానులకు లాభం చేకూరలేదు. సాధారణంగా వేసవిలో సినిమాలకు అధిక వసూళ్లు వుంటాయి. అయితే ఈ ఏడాది ఏ చిత్రం వసూళ్లు సాధించలేక పోయింది. వేసవిలోనూ థియేటర్లు బోసిపోయాయి. ఈ సీజన్లో ప్రజలు థియేటర్లకు వెళ్లడం కంటే పర్యాటక స్థలాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చిత్రాల విడుదలకు నిర్మాతల సంఘం కొన్ని నిబంధనలు విధించినప్పటికీ వాటిని ఎవరూ అనుసరించడం లేదు. దీని గురించి నిర్మాతల సంఘం అధ్యక్షుడు కేఆర్ మాట్లాడుతూ సినిమా ప్రమాదకరమైన మార్గంలో పయనిస్తోందని అన్నారు. సాధారణంగా ఏ రంగంలోనైనా సమస్యలు ఎదురైనప్పుడు భిన్నాభిప్రాయాలకు స్వస్తి చెప్పి ఐక్యతతో వ్యవహరిస్తారని, అయితే సినీరంగంలో ఇటువంటి సమస్యలు ఏర్పడినపుడు అభిప్రాయభేదాలు, చీలికలు ఏర్పడతాయన్నారు. చిత్రం విడుదల సమయంలో తాము రూపొందించిన నిబంధనలు ఆచరణలో లేకపోవడం వాస్తవమేనన్నారు. డిజిటల్ టెక్నాలజీ కారణంగా కొత్తవారు అనేక మంది సినీ రంగంలో ప్రవేశిస్తుండడంతో అనేక చిత్రాలు వస్తున్నాయన్నారు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, పాటలను బట్టి చిత్రాలను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఏ చిత్రాన్ని చూడకూడదో ప్రజలు క్షుణ్ణంగా నిర్ణయిస్తున్నారన్నారు. ప్రతి రోజూ ఒక చిత్రం విడుదలవుతోందని, భవిష్యత్తులో ఉదయం ఒక సినిమా, సాయంత్రం ఒక సినిమా రిలీజయినా ఆశ్చర్యపోనక్కరలేదన్నారు. వేసవిలో థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తుందని. అయితే ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపారు. ఇది సినిమాకు నిజంగా గడ్డుకాలమని తెలిపారు.