Google home page
-
యూట్యూబ్ డౌన్: స్పందించిన గూగుల్
న్యూఢిల్లీ: బ్రేకింగ్ న్యూస్... ప్రపంచవ్యాప్తంగా సోమవారం సాయంత్రం గుగూల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. జీమెయిల్, గూగుల్ హోం, గూగుల్ డ్రైవ్‌తో పాటు యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్లు డౌన్ కావడంతో అన్ని ఆన్‌డ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్‌లలో ఈ అప్లికేషన్ల సేవలు నిలిచిపోయాయి. కాగా, సేవల అంతరాయంపై గూగుల్ స్పందించింది. కొన్ని సాంకేతిక లోపాల వల్ల సర్వర్లు డౌన్ అయ్యాయని, కాసేపట్లో సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది. (చదవండి: ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!) అప్డేట్: దాదాపు 20 నిమిషాల అంతరాయం తర్వాత గూగుల్ తన సేవలను తిరిగి పునరుద్ధరించింది. -
బ్లాక్ రిబ్బన్‌తో గూగుల్ నివాళి
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నివాళులర్పించింది. దేశానికి ఎంతో సేవ చేసిన కలాం గొప్పతనాన్ని తెలిపేందుకు గూగుల్ వెబ్సైట్ హోమ్ పేజీలో బ్లాక్ రిబ్బన్ ను పెట్టి సంతాపం ప్రకటించింది. గురువారం కలాం అంత్యక్రియలు ఆయన సొంతగడ్డ తమిళనాడు రామేశ్వరంలోని పేక్కరుంబు గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. షిల్లాంగ్ లోని ఏయిమ్స్ లో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ కుప్పకూలి అనంతరం ఆయన మృతిచెందిన విషయం విదితమే.