భక్త జనసంద్రంగా భీమిలి బీచ్
మహోదయం సముద్ర స్నానాల సందర్భంగా భీమిలిలోని గోస్థని సాగర సంగమ తీరంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరడంతో.. తీర ప్రాంతం జనసంద్రంగా మారింది. ఈ ఒక్క రోజే సుమారు 3 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున మంత్రి మానిక్యాల రావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మహోదయాన్ని ప్రారంభించారు.